సాయి తేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతీ దర్శకత్వంలో వచ్చిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘ప్రతిరోజూ పండగే’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని డీసెంట్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా తాజా కలెక్షన్స్ చూస్తే.. డీసెంట్ టాక్ తో బాక్సాపీస్ ఓపెన్ చేసిన ఈ చిత్రం నిన్న ఆదివారం నాడు రూ .76 లక్షల షేర్ ను వసూళ్లు చేసింది. అలాగే శుక్రవారం నైజాంలో 41 లక్షలను, శనివారం 60 లక్షల వసూళ్లును రాబట్టి అదరగొడుతోంది. ఈ సినిమా ఓవరాల్ కలెక్షన్స్ ఇప్పటివరకూ నైజాంలో రూ .9.08 కోట్ల షేర్‌ను రాబట్టింది. సాయి తేజ్‌కు నైజాంలో ఇవే బెస్ట్ కలెక్షన్స్. వరుసగా ప్లాప్స్‌ను ఎదుర్కుంటూ... సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సాయి తేజ్‌కు ఈ సినిమా తన కెరీర్‌తో అతిపెద్ద విజయంగా నిలవనుంది. ఈ సినిమా అటూ ఓవర్సీస్లో కూడా పరవాలేదనిపిస్తోంది. ప్రతిరోజూ పండగే’ ఓవర్సీస్లో హాఫ్ మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసింది. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సత్యరాజ్, రావు రమేష్ ఇతర ప్రధాన పాత్రల్లో ఆకట్టుకున్నారు. థమన్ సంగీతం కూడా సినిమా విజయానికి దోహదం చేసింది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.