Home /News /movies /

SAI TEJ PRATI ROJU PANDAAGE FIRST WEEKEND COLLECTIONS SR

సాయి తేజ్.. ప్రతి రోజూ పండగే మూడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..

Instagram

Instagram

సాయి తేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతీ దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ డ్రామా  ప్రతిరోజూ పండగే. ఈ చిత్రం ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలై డీసెంట్ టాక్‌తో దూసుకుపోతోంది.

    సాయి తేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతీ దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ డ్రామా  ప్రతిరోజూ పండగే. ఈ చిత్రం ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలై డీసెంట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా నైజాంలో సాయి తేజ్‌కు గుర్తించుకునే కలెక్షన్స్ రాబట్టింది.  డీసెంట్ టాక్‌తో బాక్సాపీస్ ఓపెన్ చేసిన ప్రతిరోజూ పండగే మొదటిరోజు నైజాం ఏరీయాలో 1.25 కోట్ల షేర్‌ను రాబట్టింది. సాయి తేజ్ గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ మొత్తం ఓ రికార్డు అని చెప్పోచ్చు. ఎ సెంటర్లలో మంచి కలెక్షన్లను వస్తున్నాయి. శుక్రవారం మొదటిరోజే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం  మూడు రోజుల థియేట్రికల్ రన్ లో టికెట్ కౌంటర్లలో ఆకట్టుకునే గణాంకాలనే నమోదు చేసింది. మూడు రోజులకు గానూ రూ 8.63 కోట్ల థియేట్రికల్ షేర్ వసూలు చేసింది. ప్రతి రోజూ పండగే యుఎస్ లో $ 200 కె డాలర్స్ ను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో దాదాపు 23.25 కోట్ల రూపాయల గ్రాస్‌ను వసూలు చేసింది. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా దాదాపు 800 స్క్రీన్స్‌‌లో విడుదలైంది. ఎమోషనల్ ఎంటర్‌ టైనర్‌‌గా తెరకెక్కిన ప్రతిరోజూ పండగే చిత్రానికి రానురాను వసూళ్లు ఇంకా పెరుగుతాయని ఆశిస్తున్నారు దర్శక నిర్మాతలు.

    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: PratiRoju Pandaage, Sai Dharam Tej

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు