SAI TEJ PRATHI ROJU PANDAGE MOVIE GETS CAREER BEST OPENINGS IN NIZAM AREA SR
సాయి తేజ్.. ప్రతి రోజూ పండగే నైజాం కలెక్షన్స్ ఎంతంటే..
Twitter
సాయి తేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతీ దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ డ్రామా ప్రతిరోజూ పండగే. ఈ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలై డీసెంట్ టాక్‌తో దూసుకుపోతోంది.
సాయి తేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతీ దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ డ్రామా ప్రతిరోజూ పండగే. ఈ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలై డీసెంట్ టాక్‌తో దూసుకుపోతోంది. మారుతీ మార్క్ ఫన్ అండ్ ఎమోషన్స్ తో నిండిన ఈ సినిమాలో సత్యరాజ్, రావు రమేష్‌ల నటన ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది. మరోవైపు తమన్ సంగీతం కూడా ప్రేక్షకుల్నీ సినిమా థియేటర్‌కు తీసుకొచ్చింది. కాగా నిన్న విడుదలైన ఈ సినిమా నైజాంలో సాయి తేజ్‌కు గుర్తించుకునే కలెక్షన్స్ రాబట్టింది. డీసెంట్ టాక్‌తో బాక్సాపీస్ ఓపెన్ చేసిన ప్రతిరోజూ పండగే మొదటిరోజు నైజాం ఏరీయాలో 1.25 కోట్ల షేర్‌ను రాబట్టింది. అయితే సాయి తేజ్ గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ మొత్తం రికార్డు అని చెప్పోచ్చు. ఇదీ ముందు ముందు పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ చిత్రానికి పోటీగా విడుదలైన బాలయ్య రూలర్ నెగెటివ్ టాక్ తెచ్చుకోవడం సాయి తేజ్ సినిమాకు కలిసొచ్చే అంశం. మరోవైపు కార్తీ దొంగ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దొంగ డబ్బింగ్ మూవీ కావంతో సాయి తేజ్ సినిమాపై అంతగా ప్రభావం చూపకపోవచ్చు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి రోజూ పండుగే సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.