‘ప్రతిరోజూ పండగే’ మోషన్ పోస్టర్ రిలీజ్.. ఇది సాయి తేజ్ నాన్నకు ప్రేమతో..

చిత్ర‌ల‌హ‌రి త‌ర్వాత సాయి తేజ్ కెరీర్ గాడిన ప‌డింది. ఈ సినిమాతో నాలుగేళ్ల త‌ర్వాత విజ‌యం అందుకున్నాడు మెగా మేన‌ల్లుడు. అర‌డ‌జ‌న్ ఫ్లాపుల త‌ర్వాత వ‌చ్చిన విజ‌యం కావ‌డంతో జాగ్ర‌త్త‌గా కాపాడుకోడానికి ప్ర‌య‌త్నిస్తున్నాడు సాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 11, 2019, 8:16 PM IST
‘ప్రతిరోజూ పండగే’ మోషన్ పోస్టర్ రిలీజ్.. ఇది సాయి తేజ్ నాన్నకు ప్రేమతో..
ప్రతిరోజూ పండగే పోస్టర్ (Source: Twitter)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 11, 2019, 8:16 PM IST
చిత్ర‌ల‌హ‌రి సినిమా త‌ర్వాత సాయి ధ‌ర‌మ్ తేజ్ కెరీర్ మ‌ళ్లీ గాడిన ప‌డింది. ఈ సినిమాతో నాలుగేళ్ల త‌ర్వాత విజ‌యం అందుకున్నాడు మెగా మేన‌ల్లుడు. అర‌డ‌జ‌న్ ఫ్లాపుల త‌ర్వాత వ‌చ్చిన విజ‌యం కావ‌డంతో జాగ్ర‌త్త‌గా కాపాడుకోడానికి చాలా ప్ర‌య‌త్నిస్తున్నాడు సాయి. ప్ర‌స్తుతం మారుతి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఇప్ప‌టికే ఈ కాంబినేష‌న్లో వస్తున్న ప్రతిరోజూ పండగే చిత్ర షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయింది. డిసెంబర్‌లో విడుదల కానుంది. గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మారుతి త‌న‌లోని మ‌రో కోణాన్ని ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడు.

Sai Tej new movie Pratiroju Pandaage Motion Poster released and Maruthi come up with Emotional story pk చిత్ర‌ల‌హ‌రి త‌ర్వాత సాయి తేజ్ కెరీర్ గాడిన ప‌డింది. ఈ సినిమాతో నాలుగేళ్ల త‌ర్వాత విజ‌యం అందుకున్నాడు మెగా మేన‌ల్లుడు. అర‌డ‌జ‌న్ ఫ్లాపుల త‌ర్వాత వ‌చ్చిన విజ‌యం కావ‌డంతో జాగ్ర‌త్త‌గా కాపాడుకోడానికి ప్ర‌య‌త్నిస్తున్నాడు సాయి. Pratiroju Pandaage Motion Poster,Pratiroju Pandaage Motion Poster released,sai tej,sai tej twitter,sai tej maruthi,sai tej movies,sai tej sathyaraj,Pratiroju Pandaage twitter,sai tej Pratiroju Pandaage,sai tej raashi khanna,telugu cinema,ప్రతిరోజూ పండగే,ప్రతిరోజూ పండగే మోషన్ పోస్టర్ రిలీజ్,ప్రతిరోజూ పండగే మోషన్ పోస్టర్ విడుదల,సత్యరాజ్ సాయి తేజ్,సాయి తేజ్ మారుతి,సాయి తేజ్ రాశీఖన్నా,తెలుగు సినిమా
సాయి తేజ్ మారుతి


ఈ రోజుల్లో, బ‌స్టాప్ లాంటి సినిమాల‌తో యూత్.. ఆ త‌ర్వాత భ‌లేభ‌లే మ‌గాడివోయ్, మ‌హానుభావుడు లాంటి సినిమాల‌తో కామెడీ జోన‌ర్స్ ట‌చ్ చేసిన మారుతి.. ఈ సారి పూర్తిగా ఎమోష‌న‌ల్ వైపు వెళ్తున్నాడు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ క‌థ‌లో సాయి ధ‌ర‌మ్ తేజ్‌ను ఒప్పించాడు మారుతి. ప్రతిరోజూ పండగే అనే టైటిల్లోనే సినిమా ఎలా ఉండబోతుందో అర్థమైపోతుంది. ఇందులో తండ్రీ కొడుకుల ఎమోషన్స్ చూపించనున్నాడు మారుతి. ఇప్పటికే ఈ కథలతో చాలా సినిమాలు వచ్చినా కూడా ఎప్పుడూ తండ్రీ కొడుకుల కథ కొత్తగానే ఉంటుంది. ఇప్పుడు మారుతి కూడా ఇదే చేయబోతున్నాడు.

ప్రతిరోజూ పండగే సినిమాలో సాయి తేజ్‌తో రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పుడు విడుదలైన మోషన్ పోస్టర్ కూడా తండ్రీ కొడుకుల ఎమోషన్‌నే చూపించాడు మారుతి. ఇందులో సత్యరాజ్ హీరో తండ్రిగా కనిపిస్తున్నాడు. క‌చ్చితంగా ఈ చిత్రంతో విజ‌యం అందుకుంటాన‌ని ధీమాగా చెబుతున్నాడు మారుతి. శైల‌జారెడ్డి అల్లుడు నిరాశ ప‌రచ‌డంతో మారుతికి కూడా సాయి ధ‌ర‌మ్ తేజ్ సినిమా కీల‌కంగా మారింది. చిత్రలహరి తర్వాత మరో హిట్ కొట్టాలని సాయి కూడా కసిమీదున్నాడు. మ‌రి ఈ ఇద్ద‌రూ క‌లిసి ఏం చేస్తారో చూడాలిక‌.
First published: September 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...