రికార్డ్స్‌ను బ్రేక్ చేస్తోన్న మెగా హీరో...

సాయి ధరమ్ తేజ్ తన పేరు మార్చుకుని హిట్ కొట్టాడు. సుప్రీమ్ తర్వాత అరడజన్ ఫ్లాపులు ఇచ్చిన ఈ హీరో.. ధరమ్ పీకేసి సాయి తేజ్ అంటూ వచ్చి చిత్రలహరి సినిమాతో విజయం అందుకున్నాడు. అయితే ఆయన కోరుకున్నట్లుగా సూపర్ హిట్ అయితే రాలేదు కానీ 14 కోట్ల బిజినెస్ చేసిన చిత్రలహరి 15 కోట్లు వసూలు చేసింది.

మెగా హీరో సాయి తేజ్.. నటించిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ తెచ్చుకుంటోంది. దీంతో ఓపెనింగ్స్ కూడా అదిరిపోనున్నాయని అంటున్నారు సినీ పండితులు.

 • Share this:
  మెగా హీరో సాయి తేజ్.., నివేథా పేతురాజ్, సునీల్, కళ్యాణి ప్రియ దర్శిని ప్రధాన పాత్రల్లో, కిషోర్ తుమ్మల దర్శకత్వంలో  వచ్చిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ తెచ్చుకుంటోంది. దీంతో ఓపెనింగ్స్ కూడా అదిరిపోనున్నాయని అంటున్నారు సినీ పండితులు. ఈ సినిమా ఓవర్సీస్ టాక్ కూడా పాజీటివ్‌గా రావడంతో..మిగితా సాయి తేజ్‌ సినిమాల రికార్డ్స్‌ను ఈ సినిమా ఊరికే బ్రేక్ చేయనుందని అంటున్నారు. సాయి తేజ్‌కు వరుసగా.. అన్ని ఫ్లాఫ్స్ వచ్చిన తర్వాత కుడా..  బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంత మంచి ఓపెనింగ్స్‌ను సొంతం చేసుకోవడం.. చిత్రలహరి మూవీని చూసి ట్రేడ్ కూడా షాక్ అవుతున్నారు.  దీంతో సాయి తేజ్‌కు సరైన కథ కుదిరితే అదరగొడుతాడని మరోసారి రుజువైంది.  అది అలా ఉంటే..ఈ సినిమాకు ప్రస్తుతం..పోటిలో ఉన్న సినిమా మజిలీ..అక్కినేని నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌషిక్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా కూడా.. సూపర్ సాలిడ్‌గా  కలెక్షన్లు అదరగొడుతుండడంతో..చిత్ర లహారి ఎంతవరకు తన జోరును  కొనసాగిస్తది.. అన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తి గా మారింది.

  చిత్ర లహరి పోస్టర్ Photo: Twitter
  చిత్ర లహరి పోస్టర్ Photo: Twitter


  వరుస ఫ్లాఫ్స్ లో కూడా ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ అంటే సూపర్ అనే చెప్పోచ్చు. అంతేకాకుండా..సినిమా బిజినెస్ కూడా తక్కువే అవ్వడంతో..చిత్రలహరి తొలిరోజు సాధించే కలెక్షన్స్‌తోనే చాలా వరకు పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెచ్చే చాన్స్ ఉండనుందని అంటున్నారు ట్రెడ్ పండితులు. ఇదంతా చూస్తుంటే..చాలా కాలం తర్వాత సాయి తేజ్ బంపర్ హిట్ కొట్టాడని  చెప్పోచ్చు.
  First published: