• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SAI PALLAVI WILL PLAY CHIRANJEEVI SISTER CHARECTER IN MEHER RAMESH VEDALAM TELUGU REMAKE HERE ARE THE DETAILS TA

Chiranjeevi Sai Pallavi: చిరంజీవి సినిమాలో సాయి పల్లవి.. చిరుతో పోటాపోటీగా రౌడీ బేబి..

Chiranjeevi Sai Pallavi: చిరంజీవి సినిమాలో సాయి పల్లవి.. చిరుతో పోటాపోటీగా రౌడీ బేబి..

చిరంజీవి,సాయి పల్లవి (File/Photo)

Chiranjeevi Sai Pallavi |  మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మెహర్ రమేష్ చిత్రానికి ఓకెే చెప్పాడు. ఈ చిత్రంలో సాయి పల్లవి ఇంపార్టెంట్ రోల్ చేయనున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

  • Share this:
    Chiranjeevi Sai Pallavi |  మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో కథానాయికుడిగా కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు. ఇక  ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన షెడ్యూల్ కంప్లీట్ చేసి వచ్చే యేడాది సమ్మర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు చిరంజీవి.. మలయాళ సూపర్ హిట్ ‘లూసీఫర్’ రీమేక్‌లో యాక్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. ముందుగా సుజిత్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని చేయాలనుకున్నా.. ఫైనల్‌గా ఈ రీమేక్ బాధ్యతలను వినాయక్ చేతిలో పెట్టారు చిరంజీవి. ఈ సినిమా తర్వాత చిరంజీవి.. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఒక యాక్షన్ స్టైలిష్ ఓరియంటెడ్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను తమిళంలో అజిత్ హీరోగా నటించిన ‘వేదాలం’ సినిమాకు రీమేక్.  సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో చెల్లెలు పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఈ  క్యారెక్టర్‌ను ఎవరైనా స్టార్ హీరోయిన్ చేస్తేనే ఆ సినిమాకు సరిపోతుంది. అందుకే ఈ సినిమాలో చిరంజీవి సిస్టర్ పాత్రకు రౌడీ బేబి సాయి పల్లవి పేరును పరిశీలిస్తున్నారు.

    Sai pallavi will Play chiranjeevi sister charecter in meher ramesh vedalam telugu remake here are the details,chiranjeevi,sai pallavi,chiranjeevi sai pallavi,sai pallavi chiranjeevi sister charecter in meher ramesh movie,chiranjeevi vedalam remake sai pallavi meher ramesh,chiranjeevi twitter,meher ramesh,meher ramesh twitter,Pawan kalyan Twitter,pawan kalayn confirmed chiranjeevi meher ramesh movie,meher ramesh chiranjeevi movie,meher ramesh mahesh babu movie,meher ramesh movies,mehar ramesh shakti movie,meher ramesh speech,chiranjeevi movies,director meher ramesh,chiranjeevi about meher ramesh,meher ramesh movie news,meher ramesh next movies,meher ramesh movie action scenes,chiranjeevi new movie,telugu cinema,మెహర్ రమేష్,చిరంజీవి,చిరంజీవి మెహర్ రమేష్,సాయి పల్లవి,సాయి పల్లవి చిరంజీవి,చిరంజీవి చెల్లెలు పాత్రలో సాయి పల్లవి,చిరంజీవి సాయి పల్లవి మెహర్ రమేస్ వేదాలం రీమేక్
    చిరంజీవి,సాయి పల్లవి (File/Photo)


    ఇప్పటికే మెహర్ రమేష్‌తో పాటు చిరంజీవి కూడా సాయి పల్లవికి ఫోన్ చేసిన ఈ సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ ప్రాముఖ్యతను సాయి పల్లవికీ వినిపించినట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమాలో సాయి పల్లవి నటించే విషయమై అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని కూడా చిరంజీవి, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో చేయనున్నట్టు సమాచారం. ఒక మెహర్ రమేష్.. ఏడేళ్ల క్రితం వెంకటేష్‌తో షాడో సినిమా చేసాడు. ఆ తర్వాత మహేష్ బాబుకు సంబంధించిన యాడ్ షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇపుడు చిరంజీవితో ‘వేదాలం’ రీమేక్‌తో మరోసారి మెగాఫోన్ పట్టుకోబోతున్నాడు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: