విజయశాంతి, రోజా బాటలో సాయి పల్లవి..

సాయి పల్లవి.. ఫిదా సినిమాతో తెలుగువారి గుండెల్లో ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుంది. తమిళ భామ అయిన..ఆ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ..అదరగొట్టింది.

news18-telugu
Updated: November 6, 2019, 3:45 PM IST
విజయశాంతి, రోజా బాటలో సాయి పల్లవి..
విజయశాంతి,సాయి పల్లవి,రోజా (Twitter/Photo)
  • Share this:
సాయి పల్లవి.. ఫిదా సినిమాతో తెలుగువారి గుండెల్లో ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుంది. తమిళ భామ అయిన..ఆ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ..ఆకట్టుకుంది. అలా తాను ఎంచుకున్న సినిమాల ద్వారా.. మంచి నటిగా..హావ భావాలను చక్కగా ప్రదర్శించగల నటిగా పేరు తెచ్చుకుంది. ఆమె ప్రస్తుతం తెలుగులో ఓ సినిమాను చేస్తోంది. దీనికి వేణు ఊడుగుల (నీది నాది ఒకేకథ ఫేమ్‌) దర్శకత్వం వహిస్తున్నారు. రానా హీరోగా చేస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్‌ ప్రేమకథగా, రాజకీయ థ్రిల్లర్‌గా సాగనున్న ఈ చిత్రంలో రానా రాజకీయ నాయకుడిగాను, సాయిపల్లవి పేదింటి యువతిగా కనిపించనున్నది. ఈ మూవీలో సాయి పల్లవి మేకప్ లేకుండా నక్స లైట్ పాత్రలో నటించనున్నట్లు సమచారం. గుండెల్నీ పిండిసే సన్నివేశాలతో అల్లుకున్న ఈ కథలో..సాయి పల్లవి,రానా క్యారెక్టర్స్‌ను మనసుకు హత్తుకునే విధంగా చిత్రీకరించనున్నారు.

రోజా, విజయశాంతి


అయితే రానా ఇతర సినిమాల్లో బీజీగా ఉండటం వలన ఈ చిత్రం సెట్స్‌పైకి వచ్చేందుకు ఆలస్యమవుతోందట. బహుశా జూన్‌ నుంచి చిత్రీకరణను మొదలుపెడతారని అంటున్నారు. ఈ చిత్రంలో నటి టబు కూడా ఓ కీలక పాత్రలో.. మానవ హక్కుల కోసం పోరాటం చేసే మహిళగా ఆమె పాత్ర ఉండనుంది. వీరికి తోడు మరో సీనియర్‌ నటి ప్రియమణి కూడా మరో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వరంగల్‌, కరీంనగర్‌, సిద్ధిపేట, హైదరాబాద్‌లలో చిత్రీకరించునున్నారు. నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తోన్న ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విడుదల కానుంది. అది అలా ఉంటే..ఇంతకు ముందు ఇలా తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ఒసేయ్ రాములమ్మాలో విజయ శాంతి, అలాగే స్వర్ణక్క, ఎన్ కౌంటర్ సినిమాల్లో రోజా నక్సలైట్ పాత్రల్లో చేసి..అదరగొట్టిన సంగతి తెలిసిందే.
First published: November 6, 2019, 3:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading