వరంగల్ ఆర్టిసీ బస్టాండ్‌లో సాయిపల్లవి... ఎవరూ గుర్తుపట్టలేదుగా

ఓ బ్యాగ్ పట్టుకొని అచ్చం పల్లెటూరు అమ్మాయిలా వరంగల్ జిల్లా పరకాల బస్టాప్‌లో సాయిపల్లవి బస్టాప్‌లో ప్రత్యక్షమైంది.

news18-telugu
Updated: September 8, 2019, 2:06 PM IST
వరంగల్ ఆర్టిసీ బస్టాండ్‌లో సాయిపల్లవి... ఎవరూ గుర్తుపట్టలేదుగా
సాయి పల్లవి Photo: Instagram.com/saipallavi.senthamarai/
  • Share this:
‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయిపల్లవి. తెలంగాణ యాసలో సాయి పల్లవి చెప్పే డైలాగులకు ఆమె ఫ్యాన్స్ అంతా పడి చస్తుంటారు. నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ భామ.. తాజాగా ఓ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రత్యక్షమైంది. వరంగల్ జిల్లా పరకాల ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్న కుర్చీలపై సాయిపల్లవి కూర్చున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేణు అడుగుల దర్శకత్వంలో రానా - సాయిపల్లవి కలిసి జంటగా నటిస్తున్న చిత్రం ‘విరాట్ పర్వం’ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వరంగల్ జిల్లాలోని పరకాలలో జరుగుతోంది .

అక్కడ బస్టాప్‌లో సాయి పల్లవి బస్సు ఎక్కే సన్నివేశాల్ని షూట్ చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఓ కెమెరాల బస్టాండ్ పక్కనే ఉన్న ఓ హోటల్‌లో పెట్టి షూటింగ్ చేయడం మొదలు పెట్టింది. ఈ సీన్‌ ఓ బ్యాగ్ పట్టుకొని లంగా జాకెట్‌లో అచ్చం పల్లెటూరు అమ్మాయిలా సాయిపల్లవి బస్టాప్‌లో కనిపిస్తోంది. అయితే ఆ సమయంలో అక్కడ చాలామంది ప్రయాణికులు కూడా ఉన్నారు. బస్టాప్ అంతా జనంతో బిజీబిజీగా ఉంది. కానీ... ఎవరూ సాయిపల్లవిని గుర్తు పట్టలేకపోయారు. తర్వాత నెమ్మదిగా ఆమె అక్కడ్నుంచి వెళ్లిపోయింది. దీంతో కొందరు ఈ వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.First published: September 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు