అవును.. నిజంగానే సాయిపల్లవి ఇప్పుడు సైకిల్ ఎక్కింది. అంటే రాజకీయాల్లోకి కానీ వచ్చేసిందా ఏంటి అనుకోవద్దు.. ఇక్కడ సైకిల్ ఎక్కడం అంటే సినిమా కోసమే. తెలుగుదేశం కోసం అస్సలు కాదు.. అయినా ఇప్పుడు తెలుగుదేశం ఓడిపోయి పాపం చిక్కుల్లో పడిపోయింది కదా. దాని జోలికి ఎవరూ రారు ఇప్పట్లో రారు కూడా. ఇదిలా ఉంటే ప్రస్తుతం విరాటపర్వం సినిమాలో నటిస్తుంది సాయిపల్లవి. 'నీదీ నాదీ ఒకే కథ' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన వేణు ఉడుగుల ఇప్పుడు రెండో ప్రయత్నంగా సాయిపల్లవితో సినిమా చేస్తున్నాడు.

విరాట పర్వం పిక్స్
పైగా ఇది నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కే సినిమా. ఇందులో అడవిలో అక్క పాత్రలో నటిస్తుంది పల్లవి. ఇప్పటికే తొలి షెడ్యూల్ కూడా పూర్తి చేసాడు ఈ దర్శకుడు. రానా ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా 90ల నేపథ్యంలో జరిగే కథ. దానికి తగ్గట్లే ముందు టైటిల్లో విరాటపర్వం 1992 అనుకున్నాడు కానీ ఆ తర్వాత ఎందుకో మరి 1992 తీసేసాడు దర్శకుడు. ఈ సినిమాలో టబు కూడా కీలక పాత్రలో నటించబోతుందని తెలుస్తుంది.

సాయిపల్లవి లీక్డ్ పిక్
ఇక ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ ఇలా అయిపోయిందో లేదో అప్పుడే లీకులు మొదలైపోయాయి. దాంతో ఇప్పుడు సాయిపల్లవి వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అందులో సైకిల్ తొక్కుతూ కనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సీన్ సినిమాలో కీలకమైన సన్నివేశంలో వస్తుందని తెలుస్తుంది. ఈ స్క్రీన్ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది. తొలి షెడ్యూల్లోనే లీకులు బయటికి వస్తే.. ఆ తర్వాత ఎలా ఉండబోతుందో మరి పరిస్థితి.
Published by:Praveen Kumar Vadla
First published:July 02, 2019, 13:12 IST