Pawan Kalyan-Sai Pallavi : సాయి పల్లవికి బంపర్ ఆఫర్.. పవన్ మలయాళ రీమేక్‌లో హీరోయిన్‌గా ఫిదా బ్యూటీ..

Sai Pallavi : తమిళ పొన్ను సాయి పల్లవి ఓ అదిరిపోయే అవకాశాన్ని అందిపుచ్చుకుందని సమాచారం అందుతోం

news18-telugu
Updated: October 29, 2020, 4:40 PM IST
Pawan Kalyan-Sai Pallavi : సాయి పల్లవికి బంపర్ ఆఫర్.. పవన్ మలయాళ రీమేక్‌లో హీరోయిన్‌గా ఫిదా బ్యూటీ..
పవన్ కళ్యాణ్, సాయి పల్లవి Photo : Twitter
  • Share this:
Sai Pallavi : తమిళ పొన్ను సాయి పల్లవి ఓ అదిరిపోయే అవకాశాన్ని అందిపుచ్చుకుందని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ ఇటీవల మరో రీమేక్‌కు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. ఈ సినిమాను 'సితార ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 'అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్' సాగర్ చంద్ర ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో సాయి పల్లవి ఓ హీరోయిన్ గా ఎంపికైనట్టు టాక్ బలంగా వినిపిస్తోంది. ఒకవేళ అది నిజమే అయితే ఈమె గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్టే అని చెప్పాలి. ఇక సాయి పల్లవి మిగితా సినిమాల విషయానికి వస్తే.. ఈ భామ ప్రస్తుతం తెలుగులో 'విరాట పర్వం' అనే సినిమాను చేస్తోంది. ఈ సినిమాను వేణు ఊడుగుల (నీది నాది ఒకే కథ ఫేమ్‌) దర్శకత్వం వహిస్తున్నారు. రానా హీరోగా చేస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్‌ ప్రేమకథగా, రాజకీయ థ్రిల్లర్‌గా వస్తోంది. రానా రాజకీయ నాయకుడిగాను, సాయిపల్లవి పేదింటి యువతిగా కనిపించనున్నది.  సాయి పల్లవి తెలుగులో మరో సినిమాలోను నటిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమాలో సాయి పల్లవి నటిస్తోంది. నాగ చైతన్య హీరోగా చేస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది.

దీంతో పాటు ఆమె మరో లేడీ ఒరియెంటెడ్ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. వరుస హిట్లు కొడుతోన్న అనిల్‍ రావిపూడి తన "ఎఫ్‍ 3" సినిమా మొదలు పెట్టే వీల్లేని సిట్యువేషన్‍లో ఉన్నాడు. ఎందుకంటే.. వెంకటేష్‍, వరుణ్‍ తేజ్‍ ఇద్దరూ వచ్చే ఏప్రిల్‍ తర్వాతే అందుబాటులోకి రానున్నారు. మిగతా హీరోలంతా కూడా బిజి బిజీగా వున్నారు. దీంతో ఎప్పట్నుంచో తన దగ్గరున్న ఒక హీరోయిన్‍ సెంట్రిక్‍ కథను తెరకెక్కించాలని అనిల్ ప్లాన్‍ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా హీరోయిన్‍ ప్రధానంగా సాగే కథ అయినా.. ఎప్పటిలాగే తన మార్కు వినోదం, కమర్షియల్‍ ఎలిమెంట్స్ ఉంటాయట. ఇక ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‍ అయితే బాగుంటుందని భావించిన అనిల్.. ఆమెను కాంటాక్ట్ చేసినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని దిల్‍ రాజు నిర్మించే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి చర్చల దశలో వున్న ఈ చిత్రంపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. ఇటు సినిమాలతో పాటు సాయి పల్లవి ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. పరువు హత్యల బ్యాక్‌డ్రాప్‌లో ఓ తమిళ వెబ్‌ సిరీస్‌ రాబోతోంది. నాలుగు కథల సమాహారంగా రూపొందనున్న ఈ వెబ్‌సిరీస్‌కి గౌతమ్‌ మీనన్‌, వెట్రిమారన్‌, సుధా కొంగర, విఘ్నేష్‌ శివన్‌ వంటి ప్రముఖ తమిళ దర్శకులు డైరెక్ట్‌ చేయబోతున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో నాలుగు భిన్న కథలు, భిన్న నేపథ్యాలు ఉన్నప్పటికీ ప్రతి కథలోని చర్చించే అంశం మాత్రం పరువు హత్యల గురించే ఉండనుంది. ఇక దేశ వ్యాప్తంగా జరిగిన పరువు హత్యల్లో ముఖ్య మైన ఘటనల్నీ ఈ వెబ్ సిరీస్‌లో చర్చిస్తారట. అందులో భాగంగా ఇటీవల సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్యను కూడా చర్చించనున్నారట. ఈ కథను ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్‌ తెరకెక్కిస్తున్నాడు.

ఇక అల వైకుంఠపురముతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బన్ని తన తర్వాత చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ తో పుష్ప చిత్రం చేస్తున్నాడు. పుష్ప పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుంది. అల్లు అర్జున్ కు హీరోయిన్ గా రష్మిక నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. త్వరలో పెండింగ్ లో ఉన్న షూటింగ్ ను పూర్తి చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ భావిస్తోంది. కాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ వార్త హల్ చల్ చేస్తోంది. అది ఏమంటే.. సాయిపల్లవి పుష్ప చిత్రంలో నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు దీనికి సంబందించి ఇటీవలే దర్శకుడు సుకుమార్ ఆమెకు తన పాత్ర గురించి వివరించాడని.. నచ్చడంతో ఓకే అన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ విశేషమేమంటే.. సాయి పల్లవి ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు చెల్లెలుగా నటిస్తోందిని తెలుస్తోంది. దీనిపై కొంత స్పష్టత రావాల్సిఉంది.
Published by: Suresh Rachamalla
First published: October 29, 2020, 4:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading