Allu Arjun-Sai Pallavi : అల్లు అర్జున్‌కు చెల్లెలుగా సాయి పల్లవి..

Sai Pallavi : ఈ భామ ప్రస్తుతం తెలుగులో 'విరాట పర్వం' అనే సినిమాను చేస్తోంది. ఈ సినిమాను వేణు ఊడుగుల (నీది నాది ఒకే కథ ఫేమ్‌) దర్శకత్వం వహిస్తున్నారు.

news18-telugu
Updated: September 23, 2020, 12:18 PM IST
Allu Arjun-Sai Pallavi : అల్లు అర్జున్‌కు చెల్లెలుగా సాయి పల్లవి..
అల్లు అర్జున్, సాయి పల్లవి Photo : Twitter
  • Share this:
Sai Pallavi : సాయి పల్లవి అందగత్తే కాదు మంచి నటి కూడా అని తెలసిందే. సహజ సన్నివేశాలతో ఆకట్టుకునే సినిమాల తీసే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. ఆ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టింది సాయి పల్లవి. అంతేకాదు తాను ఎంచుకున్న సినిమాల ద్వారా మంచి నటిగాను పాత్రకు తగ్గట్లు హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు తెచ్చుకుంది. ఈ భామ ప్రస్తుతం తెలుగులో 'విరాట పర్వం' అనే సినిమాను చేస్తోంది. ఈ సినిమాను వేణు ఊడుగుల (నీది నాది ఒకే కథ ఫేమ్‌) దర్శకత్వం వహిస్తున్నారు. రానా హీరో మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్‌ ప్రేమకథగా, రాజకీయ థ్రిల్లర్‌గా వస్తోంది. రానా రాజకీయ నాయకుడిగాను, సాయిపల్లవి పేదింటి యువతిగా కనిపించనున్నది. సాయి పల్లవి తెలుగులో మరో సినిమాలోను నటిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమాలో నటిస్తోంది. నాగ చైతన్య హీరోగా చేస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం క్లైమాక్స్ తోపాటు.. ఓ పాటను చిత్రీకరిస్తోంది చిత్రబృందం. ఈ సినిమాతో పాటు సాయి పల్లవి.. నాని హీరోగా శ్యామ్ సింగరాయ్ పేరుతో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోంది. యువ దర్శకుడు విజయ్ దేవరకొండ టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్‌ ఈ సినిమాకు దర్శకుడు. అయితే ఈ సినిమాలో నటించడానికి గాను సాయి పల్లవి 2 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటున్నట్టు సమాచారం అందుతోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది. అయితే ఈ సినిమాలో సాయి పల్లవి కథ ప్రకారం పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుందని టాక్ వినిపిస్తోంది.

అది అలా ఉంటే గత ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల అయిన అలా వైకుంఠపురముతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బన్ని తన తర్వాత చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ తో పుష్ప చిత్రం చేస్తున్నాడు. పుష్ప పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుంది. అల్లు అర్జున్ కు హీరోయిన్ గా రష్మిక నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. త్వరలో పెండింగ్ లో ఉన్న షూటింగ్ ను పూర్తి చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ భావిస్తోంది. కాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ వార్త హల్ చల్ చేస్తోంది. అది ఏమంటే.. సాయిపల్లవి పుష్ప చిత్రంలో నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు దీనికి సంబందించి ఇటీవలే దర్శకుడు సుకుమార్ ఆమెకు తన పాత్ర గురించి వివరించాడని.. నచ్చడంతో ఓకే అన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ విశేషమేమంటే.. సాయి పల్లవి ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు చెల్లెలుగా నటిస్తోందిని తెలుస్తోంది. దీనిపై కొంత స్పష్టత రావాల్సిఉంది.

దీంతో పాటు చిరంజీవి సినిమాలో కూడా సాయి పల్లవి నటిస్తోందట. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో కథానాయికుడిగా కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు చిరంజీవి.. మలయాళ సూపర్ హిట్ ‘లూసీఫర్’ రీమేక్‌లో యాక్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. ముందుగా సుజిత్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని చేయాలనుకున్నా.. ఫైనల్‌గా ఈ రీమేక్ బాధ్యతలను సీనియర్ దర్శకుడు వినాయక్ చేతిలో పెట్టారు చిరంజీవి. ఈ సినిమా తర్వాత చిరంజీవి.. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఒక యాక్షన్ స్టైలిష్ ఓరియంటెడ్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అజిత్ హీరోగా తమిళంలొ వచ్చిన ‘వేదాళం’ సినిమాను చిరంజీవి తెలుగులో రీమేక్ చేయనున్నాడు. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో చెల్లెలు పాత్రలో సాయి పల్లవి నటించనుందని సమాచారం. దీనిపై త్వరలోనే అఫీషియల్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని కూడా చిరంజీవి, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో చేయనున్నట్టు సమాచారం.

ఇక ఇటు సినిమాలతో పాటు సాయి పల్లవి ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. పరువు హత్యల బ్యాక్‌డ్రాప్‌లో ఓ తమిళ వెబ్‌ సిరీస్‌ రాబోతోంది. నాలుగు కథల సమాహారంగా రూపొందనున్న ఈ వెబ్‌సిరీస్‌కి గౌతమ్‌ మీనన్‌, వెట్రిమారన్‌, సుధా కొంగర, విఘ్నేష్‌ శివన్‌ వంటి ప్రముఖ తమిళ దర్శకులు డైరెక్ట్‌ చేయబోతున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో నాలుగు భిన్న కథలు, భిన్న నేపథ్యాలు ఉన్నప్పటికీ ప్రతి కథలోని చర్చించే అంశం మాత్రం పరువు హత్యల గురించే ఉండనుంది. ఇక దేశ వ్యాప్తంగా జరిగిన పరువు హత్యల్లో ముఖ్య మైన ఘటనల్నీ ఈ వెబ్ సిరీస్‌లో చర్చిస్తారట. అందులో భాగంగా ఇటీవల సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్యను కూడా చర్చించనున్నారట. ఈ కథను ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్‌ తెరకెక్కించానున్నాడు.
Published by: Suresh Rachamalla
First published: September 23, 2020, 12:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading