• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SAI PALLAVI TO ACT WITH BELLAMKODA SAI SREENIVAS HERE ARE THE DETAILS SR

Sai Pallavi : బెల్లంకొండ సరసన సాయి పల్లవి.. ఇంతకీ ఏ సినిమాలో తెలుసా..

Sai Pallavi : బెల్లంకొండ సరసన సాయి పల్లవి.. ఇంతకీ ఏ సినిమాలో తెలుసా..

సాయి పల్లవి Photo : Instagram

Sai Pallavi : సాయి పల్లవి ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో నటిస్తూ సూపర్ బిజీగా ఉంది. కాగా ఈ భామకు మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

  • Share this:
    Sai Pallavi : సాయి పల్లవి ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో నటిస్తూ సూపర్ బిజీగా ఉంది. కాగా ఈ భామకు మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. సాయి పల్లవికి హిందీలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చినట్లు సమాచారం. సాయి పల్లవి విషయానికి వస్తే.. ఆమె గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. విభిన్నమైన పాత్రలను పోషిస్తూ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మలయాళం 'ప్రేమమ్' సినిమాతో సౌత్‌లో మంచి క్రేజ్ దక్కించుకుంది. సాయి పల్లవి అందగత్తే కాదు మంచి నటి కూడా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. ఆ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ పల్లెటూరు అమ్మాయిగా అదరగొట్టింది. సాయి పల్లవి తాను ఎంచుకున్న సినిమాల ద్వారా మంచి నటిగా పాత్రకు తగ్గట్లు హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు తెచ్చుకుంది. ఆ సినిమాలో భానుమతి పాత్ర లో సాయి పల్లవి చెప్పిన డైలాగులు సినిమాకే హైలెట్ అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ సినిమా తర్వాత నానితో 'ఎంసీఏ' సినిమాతో కూడా మంచి విజయం సాధించడం జరిగింది. అయితే ఆ తర్వాత వచ్చిన 'ఎన్జీకె', 'పడి పడి లేచె మనసు' సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో కొంత నిరుత్సాహాపడిన మళ్లి పుంజుకుని వరుస సినిమాలతో అదరగొడుతోంది. ఇక తాజాగా సాయి పల్లవికి బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఓ హిందీ సినిమాలో నటించనుందని తెలుస్తోంది. బెల్లంకొండ హిందీలో తెలుగు చత్రపతి రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వి వి వినాయక్ దర్శకత్వం వహించున్నారు. పెన్ మూవీస్ నిర్మిస్తోంది.

    ఈ సినిమాతో పాటు బెల్లంకొండ మరో రీమేక్‌లో నటించనున్నట్లు టాక్ నడుస్తోంది. తమిళ్‌లో ఇటీవల విడుదల ధనుష్ కర్ణన్‌ తెలుగు రీమేక్‌లో బెల్లంకొండ నటిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి కర్ణన్ రీమేక్ రైట్స్‌ను బెల్లంకొండ సురేష్ కొన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో. కర్ణన్ సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకుడు.

    ఇక సాయి పల్లవి సినిమా విషయానికి వస్తే.. రానా హీరోగా వేణు ఊడుగుల విరాటపర్వంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాతో పాటు శేఖర్ కమ్ముల నాగ చైతన్యల లవ్ స్టోరీలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలతో పాటు నాని హీరోగా వస్తోన్న శ్యామ్ సింగరాయ్‌లో కూడా సాయి పల్లవి కీలకపాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకుడు.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు