Sai Pallavi Sister dance: వైరల్ అవుతున్న సాయి పల్లవి చెల్లి పూజా డాన్స్ వీడియో..

Sai Pallavi Sister dance: సాయి పల్లవి అద్భుతమైన నటి మాత్రమే కాదు.. దానికి ముందే అంతకంటే అద్భుతమైన డాన్సర్ కూడా. సినిమాల్లోకి రాకముందే ఢీ డాన్స్ షోలో పాల్గొని తన సత్తా చూపించింది సాయి పల్లవి. సినిమాల్లో కూడా సాయి పల్లవి..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 30, 2020, 9:22 PM IST
Sai Pallavi Sister dance: వైరల్ అవుతున్న సాయి పల్లవి చెల్లి పూజా డాన్స్ వీడియో..
సాయి పల్లవి సిస్టర్ పూజా డాన్స్ (Sai Pallavi sister Pooja dance)
  • Share this:
సాయి పల్లవి అద్భుతమైన నటి మాత్రమే కాదు.. దానికి ముందే అంతకంటే అద్భుతమైన డాన్సర్ కూడా. సినిమాల్లోకి రాకముందే ఢీ డాన్స్ షోలో పాల్గొని తన సత్తా చూపించింది సాయి పల్లవి. సినిమాల్లో కూడా సాయి పల్లవి డాన్స్‌కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. దర్శక నిర్మాతలు కూడా ఈమె కోసమే ప్రత్యేకంగా కొరియోగ్రఫర్‌లతో మాట్లాడి మరీ స్టెప్పులు కంపోజ్ చేయిస్తుంటారు. ఫిదా, ఎంసిఏ లాంటి సినిమాల్లో సాయి పల్లవి డాన్సులకు ఫిదా అయిపోయారు ఫ్యాన్స్. దానికితోడు నటనలో కూడా సాయి పల్లవి టాలెంట్ సుప్రీమ్ ఉండటంతో హిట్స్ ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ భామకు ఓ చెల్లి కూడా ఉంది. ఈ విషయం చాలా మందికి తెలుసు కూడా. ఆమె పేరు పూజా. ఎక్కడికి వచ్చినా కూడా తన చెల్లిని వెంట పెట్టుకుని వస్తుంది సాయి పల్లవి. పూజాకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు అక్కతో పాటు అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. ఇప్పుడు ఈమె డాన్స్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది.
sai pallavi sister pooja dance,sai pallavi sister,sai pallavi sister pooja,sai pallavi,sai pallavi sister pooja kannan,sai pallavi sister pooja kannan mind blowing dance performance,sai pallavi sister dance videos,sai pallavi dance,sai pallavi sister pooja dance performance,sai pallavi sister pooja kannan superb dance performance,sai pallavi sister pooja dance video,sai pallavi sister dance video,sai pallavi sister pooja mind-blowing dance performance,సాయి పల్లవి చెల్లి డాన్స్,సాయి పల్లవి డాన్స్,సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ డాన్స్ వీడియో
సాయి పల్లవి సిస్టర్ పూజా డాన్స్ (Sai Pallavi sister Pooja dance)


యూ ట్యూబ్‌లో అదిరిపోయేలా పూజా డాన్స్ వీడియో వైరల్ అవుతుంది. ఈమె డాన్స్ చూసి సాయి పల్లవి సిస్టరా మజాకా అంటూ అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. ఈమె కూడా సినిమాల్లోకి వస్తుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే తన సిస్టర్ సినిమాలు చేయదని.. తనకు నటనపై ఆసక్తి లేదని తేల్చి చెప్పేసింది సాయి పల్లవి.

ఆ తర్వాత ఇప్పటి వరకు మరోసారి అలాంటి వార్తలు అయితే రాలేదు. కానీ డాన్స్ వీడియోలతో మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది పూజా. ఇక సాయి పల్లవి కెరీర్ విషయానికి వస్తే ఈమె ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. తెలుగులో విరాట పర్వంతో పాటు లవ్ స్టోరీ సినిమాలు చేస్తుంది. మరోవైపు తమిళ, మలయాళ ఇండస్ట్రీలలో కూడా సాయి పల్లవికి మంచి ఇమేజ్ ఉంది.
Published by: Praveen Kumar Vadla
First published: October 30, 2020, 9:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading