SAI PALLAVI SHOCKED WITH TWO FLOPS IN ONE DAY SHE NEEDS HIT
అయ్యో పాపం.. సాయిపల్లవికి ఎన్ని కష్టాలొచ్చాయో చూడండి..
సాయిపల్లవి ఫైల్ ఫోటో
సమంత, సాయిపల్లవికి ఏ విషయంలో పోలిక ఉంది అనుకుంటున్నారా..? ఉంది ఒక్క విషయంలో పోలిక ఉంది. ఈ ఇద్దరూ ఓ రికార్డు అందుకున్నారు. ఒకేరోజు రెండు సినిమాలతో వచ్చి అప్పట్లో బాలయ్య.. ఆ తర్వాత నాని మాత్రమే అందుకున్న రికార్డును వీళ్లు కూడా సొంతం చేసుకున్నారు. అయితే ఒకేరోజు రెండు సినిమాలు చేసినా కూడా ఫలితం మాత్రం ప్రతికూలంగా వచ్చింది. అప్పుడు సమంత.. ఇప్పుడు సాయిపల్లవికి కూడా ఇదే ఫలితం రిపీట్ అయింది.
హీరోయిన్లు మారినా ఫేట్ మాత్రం మారలేదు. ఒకేరోజు రెండు సినిమాలు విడుదల కావడం గొప్ప విషయం కాదు కానీ.. ఆ రెండు సినిమాల్లోనూ ఒకే హీరోయిన్ ఉండటం మాత్రం అరుదైన విషయం. ఇప్పుడు సాయిపల్లవి ఇదే చేసింది. ఈమె నటించిన రెండు సినిమాలు మొన్న డిసెంబర్ 21న విడుదలయ్యాయి. తెలుగులో ‘పడిపడి లేచె మనసు’.. తమిళనాట ‘మారి 2’ సినిమాలు ఒకేరోజు వచ్చాయి. అక్కడ ధనుష్.. ఇక్కడ శర్వానంద్.. ఇద్దరూ హిట్లలో ఉన్న హీరోలు.. పైగా సాయిపల్లవి కూడా మంచి జోష్ మీదుంది.. అయినా కూడా సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది.
శర్వానంద్ సాయిపల్లవి
ఆ మధ్య సమంతకు జరిగినట్లే ఇప్పుడు సాయిపల్లవికి కూడా జరిగింది. ‘యు టర్న్’, ‘సీమరాజా’ సినిమాలతో ఒకేరోజు వచ్చింది సమంత. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు సాయిపల్లవి విషయంలోనూ ఇదే సీన్ జరిగింది. పడిపడి లేచె మనసుతో పాటు మారి 2 కూడా ఫ్లాప్ అయింది. స్లో ఎమోషనల్ డ్రామా అనడంతో పడిపడి లేచె మనసు థియేటర్స్ వైపు ప్రేక్షకులు వెళ్లలేదు. ఈ చిత్రం దాదాపు 10 కోట్లకు పైగానే బయ్యర్లను ముంచేసింది. అందుకే సాయిపల్లవి కూడా 40 లక్షలు రెమ్యునరేషన్ వదిలేసుకుంది.
‘మారి 2’ లో ధనుష్, సాయిపల్లవి
ఇక తమిళనాట ‘మారి 2’ కూడా ఫ్లాప్ అయింది. ధనుష్ ఎఫెక్టుతో ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ లాంగ్ రన్ మాత్రం కుదర్లేదు. మొత్తానికి సమంత మాదిరే రెండు సినిమాలతో ఒకేరోజు వచ్చి.. రిక్త హస్తాలతో వెనక్కి వెళ్లిపోయింది సాయిపల్లవి. తెలుగులో ‘ఫిదా’, ‘ఎంసిఏ’ తర్వాత ఈమె నటించిన సినిమా ‘పడిపడి లేచె మనసు’. హ్యాట్రిక్ కొట్టాలనుకున్న సాయిపల్లవి ఆశలకు ఈ చిత్రం బాగానే గండి కొట్టింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.