SAI PALLAVI SECRETLY WATCHING MAHESH BABU SARKARU VAARI PAATA MOVIE SB
సర్కారు వారి పాట సినిమాకు సీక్రేట్‌గా వెళ్లిన.. స్టార్ హీరోయిన్!
Mahesh and Sai Pallavi Photo : Twitter
గతంలో పవన్ కళ్యాన్ సినిమా విడుదలైన సందర్భంలో కూడా ఈ హీరోయిన్ ఇలాగే దొంగతనంగా వెళ్లి పవర్ స్టార్ సినిమా చూసి వచ్చింది. ఇప్పుడు మహేష్ సినిమాకు కూడా అలాగే వెళ్లింది.
మహేష్ బాబు(Mahesh Babu) నటించిన మూవీ సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata). రీసెంట్గా ఈ సినిమా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో భారీ కలెక్షన్లతో ఈసినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. ఇక ఇటీవలే మహేష్(Mahesh) సతీమణి నమ్రత సైతం... హైదరాబాద్(Hyderabad)లోని సుదర్శన్ థియేటర్లో ఈ చిత్రాన్ని చూశారు. ప్రేక్షకుల మధ్య భర్త నటించిన సినిమా చూసి ఆమె ఎంజాయ్ చేశారు. అయితే తాజాగా మరో హీరోయిన్ కూడా మహేష్ సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లారు. ఆమె ఎవరో కాదు.. ప్రముఖ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi).
మహేష్ బాబుకు సెలబ్రిటీల్లో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు.అందులో సాయి పల్లవి ఒకరు. సాయి పల్లవి(Sai Pallavi)కి మహేష్ అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చాలా సందర్భాల్లో చెప్పారు. మహేష్ అందాన్ని వివరిస్తూ ఆమె కీలక వ్యాఖ్లయు చేశారు. అయితే తాజాగా సాయి పల్లవి హైదరాబాద్‌లోని ఓ మల్టీఫ్లెక్స్(Multi plex)లో సీక్రెట్‌గా సర్కారు వారి పాట సినిమాను వీక్షించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అయితే సాయి పల్లవి ఇలా సీక్రెట్‌గా సినిమాలకు వెళ్లడం సాయి పల్లవికి ఇది ఫస్ట్ టైం కాదు. ఆమె.. గతంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటించిన భీమ్లా నాయక్(Bheemla Nayak)కు కూడా ఇదే రీతిలో వెళ్లి అందరికీ షాక్ ఇచ్చింది.
మహేష్ త్రివిక్రమ్(Mahesh Trivikaram Comibation) కాంబినేషన్లో మరో సినిమా రానుంది. అయితే ఈ సినిమాలో చెల్లెలి పాత్రకు అధిక ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేశ్ బాబుకు చెల్లెలిగా స్టార్ హీరోయిన్ సాయి పల్లవిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఇదివరకు మెగాస్టార్ చిరంజీవి 'భోళాశంకర్' చిత్రంలో చిరుకు సిస్టర్‌గా నటించే అవకాశాన్ని సాయి పల్లవి వద్దనుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా సాయి పల్లవే తెలిపింది. అందుకే ఆ ఆఫర్ తర్వాత మహానటి కీర్తి సురేష్‌కు దక్కింది. మరీ మహేశ్ బాబు పక్కన చెల్లెలిగా చేయడానికి సాయి పల్లవి ఒప్పుకుంటుందో వేచి చూడాలి. అయితే సాయి పల్లవి అభిమానులు మాత్రం ఇలా జరగకూడదని కోరుకుంటున్నారు.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.