SAI PALLAVI SAYS WE HAVE TO WAIT FOR OUR TURN IN LIFE TILL THEN HAVE TO BE IN PATIENCE SR
అనుకున్నది సాధించాలంటే సహనం ఉండాలి : సాయి పల్లవి
Instagram
Sai Pallavi : సాయి పల్లవి అందగత్తే కాదు మంచి నటి కూడా. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది.
Sai Pallavi : సాయి పల్లవి అందగత్తే కాదు మంచి నటి కూడా. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. ఆ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టింది. సాయి పల్లవి. అంతేకాదు తాను ఎంచుకున్న సినిమాల ద్వారా.. మంచి నటిగా.. పాత్రకు తగ్గట్లు హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు తెచ్చుకుంది. ఈ భామ ప్రస్తుతం తెలుగులో 'విరాట పర్వం' అనే సినిమాను చేస్తోంది. ఈ సినిమాను వేణు ఊడుగుల (నీది నాది ఒకే కథ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నారు. రానా హీరోగా చేస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్ ప్రేమకథగా, రాజకీయ థ్రిల్లర్గా వస్తోంది. రానా రాజకీయ నాయకుడిగాను, సాయిపల్లవి పేదింటి యువతిగా కనిపించనున్నది అనేది సమాచారం. సాయి పల్లవి తెలుగులో మరో సినిమాలోను నటిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమాలో సాయి పల్లవి నటిస్తోంది. నాగ చైతన్య హీరోగా చేస్తున్నాడు. అది అలా ఉంటే మామూలుగా మనం.. అనుకున్నది జరగకపోతేనో, చేస్తున్న పనిలో ఆటంకం ఎదురైతేనో నిరాశకి గురవుతుంటాం.
A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) on
ఈ విషయంలో సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘‘మన జీవితంలో ఏదైనా జరగాలనుకున్నప్పుడు దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఫలితాలు కూడా అందులో ఒక భాగమే.. కోరుకున్న అవకాశం రాలేదని నేనెప్పుడూ బాధపడను అంటోంది. అయితే కొంత సహనంతో ఎదురు చూస్తుంటాను.. మనం కోరుకున్న అవకాశం కోసం సమయం పడుతోందనిపించినా... అది మన వరకు వచ్చినప్పుడే సరైన సమయమని నమ్ముతుంటాను అని చెబుతోంది సాయి పల్లవి.
మన్నారా చోప్రా అదిరే అందాలు...
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.