పాతికేళ్లు వచ్చాయంటే ఇంట్లో మొదలయ్యే తొలిప్రశ్న పెళ్లెప్పుడు అని..? ఇలాంటిది ఇప్పుడు సాయి పల్లవి ఏకంగా పెళ్లే చేసుకోనని స్టేట్మెంట్స్ ఇచ్చేసరికి ఇప్పుడు అందర్లోనూ ఆసక్తి మొదలైంది. అసలు సాయి పల్లవి ఏంటి.. పెళ్లికి దూరంగా ఉండటం ఏంటి..? ఎందుకు ఉన్నట్లుండి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోడానికి గల కారణమేంటి అని ఆమె అభిమానులు కూడా మదనపడుతున్నారు. ఆమె మాత్రం కేవలం అమ్మా నాన్నలను చూసుకోడానికి పెళ్లికి దూరంగా ఉంటానంటూ చెబుతుంది. అసలు ఇది కారణంగా కనిపించడం లేదు.

సాయిపల్లవి ఫైల్ ఫోటో
ఫిదా సినిమాలో కూడా ఇలాంటి పాత్రలోనే నటించింది ఈ ముద్దుగుమ్మ.. తండ్రిని వదిలేసి వెళ్లడం ఇష్టం లేక ఇష్టం లేని పెళ్లి చేసుకోడానికి సిద్ధమయ్యే పాత్ర ఇది. అయితే నిజ జీవితంలో మాత్రం అలా కాకుండా కన్యగానే ఉండిపోతానని చెబుతుంది. దానికి కారణం కూడా ఏమీ లేదు.. పేరెంట్స్ కోసం పెళ్లి అనే మాట త్యాగం చేయాలని ఫిక్సైపోయింది ఈ భాన్సువాడ భానుమతి. అయితే కాలేజీలో ఉన్నపుడు సాయి పల్లవి ప్రేమలో ఉండేదనే వార్తలున్నాయి.

సాయిపల్లవి ఫైల్ ఫోటో
అప్పట్లో ఈ విషయంపై సాయిపల్లవి కూడా ఓపెన్ అయింది. ఆ తర్వాత మాత్రం ప్రేమ గీమా జాన్తా నై అంటూ ఎంబిబిఎస్ చదువుతో బిజీ అయిపోయింది. ఇక డాన్సులు, సినిమాలు బోనస్. ఇప్పుడు కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నపుడు పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసింది సాయి పల్లవి. ప్రేమ విఫలం కారణంగానే పెళ్లికి దూరం అనే నిర్ణయం తీసుకుందా లేదంటే నిజంగానే ఆమెకు పెళ్లి అంటే అస్సలు ఇష్టం లేదా అనేది తెలియక తికమకపడుతున్నారు ఫ్యాన్స్.
Published by:Praveen Kumar Vadla
First published:June 13, 2019, 20:38 IST