• HOME
 • »
 • NEWS
 • »
 • MOVIES
 • »
 • SAI PALLAVI SAYS SHE WAS ASKED TO KISS A HERO HERE ARE THE DETAILS SR

Sai Pallavi : పెదవులపై ముద్దుపెట్టాలని దర్శకుడు కోరాడు.. అయితే : సాయి పల్లవి..

Sai Pallavi : పెదవులపై ముద్దుపెట్టాలని దర్శకుడు కోరాడు.. అయితే : సాయి పల్లవి..

తన సోదరితో సాయి పల్లవి Photo : Instagram

Sai Pallavi : మలయాళం 'ప్రేమమ్' సినిమాతో సౌత్‌లో మంచి క్రేజ్ దక్కించుకుంది సాయి పల్లవి. ఈ భామ అందగత్తే కాదు మంచి నటి కూడా.

 • Share this:
  Sai Pallavi : మలయాళం 'ప్రేమమ్' సినిమాతో సౌత్‌లో మంచి క్రేజ్ దక్కించుకుంది సాయి పల్లవి. ఈ భామ అందగత్తే కాదు మంచి నటి కూడా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. ఆ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ పల్లెటూరు అమ్మాయిగా అదరగొట్టింది. సాయి పల్లవి తాను ఎంచుకున్న సినిమాల ద్వారా మంచి నటిగా పాత్రకు తగ్గట్లు హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు తెచ్చుకుంది. ఆ సినిమాలో భానుమతి పాత్ర లో సాయి పల్లవి చెప్పిన డైలాగులు సినిమాకే హైలెట్ అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ సినిమా తర్వాత నానితో 'ఎంసీఏ' సినిమాతో కూడా మంచి విజయం సాధించడం జరిగింది. అయితే ఆ తర్వాత వచ్చిన 'ఎన్జీకె', 'పడి పడి లేచె మనసు' సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో కొంత నిరుత్సాహాపడిన మళ్లి పుంజుకుని వరుస సినిమాలతో అదరగొడుతోంది. అది అలా ఉంటే సినిమాల ఎంపిక, ముద్దు సన్నివేశాల్లో నటించడం మొదలగు విషయాల గురించి ఇటీవల సాయిపల్లవి మాట్లాడుతూ... "ఓ సినిమాలో రొమాంటిక్‌ సీన్‌లో నటించేటప్పుడు హీరో పెదవులపై ముద్దు పెట్టాలని దర్శకుడు సూచించాడు. అయితే లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించడం నాకు కంఫర్ట్‌గా అనిపించదని దర్శకుడికి చెప్పేశానని సాయిపల్లవి చెప్పింది. ఆ విధంగా మీ టూ కారణంగా లిప్‌లాక్‌ సీన్‌ నుండి తప్పించుకున్నానంటూ సాయిపల్లవి తెలిపింది. అయితే సాయిపల్లవిని లిప్‌లాక్‌ చేయమని చెప్పిన ఆ డైరెక్టర్, ఆ సినిమా ఏదో మాత్రం వెల్లడించలేదు.

  ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే ఆమె ప్రస్తుతం రానాతో కలిసి విరాట పర్వంలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు నాగచైతన్య హీరోగా వస్తోన్న లవ్ స్టోరీలో హీరోయిన్‌గా చేస్తోంది. ఈ రెండు సినిమాలతోపాటు సాయి పల్లవి మరో రెండు సినిమాలకు ఓకే చెప్పింది. ఒకటి నాని హీరోగా వస్తోన్న శ్యామ్ సింగరాయ్ కాగా.. మరోకటి మహా సముద్రం. ఈ సినిమాలో హీరోగా శర్వానంద్ చేస్తున్నాడు. ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. సాయి పల్లవి మరో అదిరిపోయే అవకాశాన్ని అందిపుచ్చుకుందని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ ఇటీవల మరో రీమేక్‌కు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. ఈ సినిమాను 'సితార ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 'అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్' సాగర్ చంద్ర ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో సాయి పల్లవి ఓ హీరోయిన్ గా ఎంపికైనట్టు టాక్ బలంగా వినిపిస్తోంది. ఒకవేళ అది నిజమే అయితే ఈమె గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్టే అని చెప్పాలి.
  ఇటు సినిమాలతో పాటు సాయి పల్లవి ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. పరువు హత్యల బ్యాక్‌డ్రాప్‌లో ఓ తమిళ వెబ్‌ సిరీస్‌ రాబోతోంది. నాలుగు కథల సమాహారంగా రూపొందనున్న ఈ వెబ్‌సిరీస్‌కి గౌతమ్‌ మీనన్‌, వెట్రిమారన్‌, సుధా కొంగర, విఘ్నేష్‌ శివన్‌ వంటి ప్రముఖ తమిళ దర్శకులు డైరెక్ట్‌ చేయబోతున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో నాలుగు భిన్న కథలు, భిన్న నేపథ్యాలు ఉన్నప్పటికీ ప్రతి కథలోని చర్చించే అంశం మాత్రం పరువు హత్యల గురించే ఉండనుంది. ఇక దేశ వ్యాప్తంగా జరిగిన పరువు హత్యల్లో ముఖ్య మైన ఘటనల్నీ ఈ వెబ్ సిరీస్‌లో చర్చిస్తారట. అందులో భాగంగా ఇటీవల సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్యను కూడా చర్చించనున్నారట. ఈ కథను ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్‌ తెరకెక్కిస్తున్నాడు. తమిళంలో రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌ అంథాలజీ 'పావకథైగల్‌' డిసెంబర్ 18న నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది.
  Published by:Suresh Rachamalla
  First published:

  అగ్ర కథనాలు