• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SAI PALLAVI SAYS SHE ENJOYS PLAYING SAD ROLES MNJ

Sai Pallavi: మా త‌ల్లిదండ్రుల‌కు ఇష్టం లేదు.. కానీ నాకు అలాంటి పాత్ర‌లు చేయ‌డ‌మంటేనే ఇష్టం

Sai Pallavi: మా త‌ల్లిదండ్రుల‌కు ఇష్టం లేదు.. కానీ నాకు అలాంటి పాత్ర‌లు చేయ‌డ‌మంటేనే ఇష్టం

సాయి పల్లవి

ఇప్ప‌టి హీరోయిన్‌ల‌లో సాయి ప‌ల్ల‌వి(Sai Pallavi)కి ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. అందం, అభిన‌యం మాత్ర‌మే కాదు అద్భుతంగా డ్యాన్స్ చేయ‌డం ఈ బ్యూటీ సొంతం. అంతేకాదు పాత్ర ప్రాధాన్యం ఉన్న చిత్రాలనే ఈ బ్యూటీ ఎంచుకుంటుంది.

  • Share this:
    Sai Pallavi: ఇప్ప‌టి హీరోయిన్‌ల‌లో సాయి ప‌ల్ల‌వికి ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. అందం, అభిన‌యం మాత్ర‌మే కాదు అద్భుతంగా డ్యాన్స్ చేయ‌డం ఈ బ్యూటీ సొంతం. అంతేకాదు పాత్ర ప్రాధాన్యం ఉన్న చిత్రాలనే ఈ బ్యూటీ ఎంచుకుంటుంది. అందుకే సాయి ప‌ల్ల‌వి అంద‌రిలో ప్ర‌త్యేకంగా క్రేజ్ సంపాదించుకుంది. కాగా సినిమాల్లో వేసే పాత్ర‌ల గురించి ఆమె ఇటీవ‌ల కొన్ని కీల‌క విష‌యాలు వెల్ల‌డించింది. త‌న‌కు ఏడ్చే పాత్ర‌లు అంటే ఇష్ట‌మ‌ని, వాటిలో న‌టించ‌డాన్ని తాను ఎంజాయ్ చేస్తాన‌ని ఆమె అన్నారు. అయితే త‌న త‌ల్లిదండ్రుల‌కు మాత్రం తాను అలాంటి పాత్ర‌లు చేయ‌డం ఇష్టం లేద‌ని వివ‌రించింది. నేను ఏడుస్తే వారు అస్స‌లు చూడ‌లేరు. అలాంటి స‌న్నివేశంలో న‌టించిన‌ప్పుడు నేను వారి మొహాలు చూస్తాను. నేను చ‌నిపోయే లేదా ఏడిచే స‌న్నివేశాలు చూస్తే మా నాన్న ఏడుస్తారు అని సాయి ప‌ల్ల‌వి తెలిపింది.

    కాగా వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సాయి ప‌ల్ల‌వి న‌టించిన పావ క‌దైగ‌ల్ ఇటీవ‌ల నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌ల అయ్యింది. ఇందులో సాయి ప‌ల్ల‌వి న‌ట‌నకు మ‌రోసారి మంచి మార్కులు ప‌డ్డాయి. ఇక ప్ర‌స్తుతం ఈ న‌టి రానా స‌ర‌స‌న విరాట ప‌ర్వంలో న‌టిస్తోంది. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో సాయి ప‌ల్ల‌వి న‌క్స‌లైట్‌గా క‌నిపించ‌నుంది. ఈ మ‌ధ్య‌న ఈ మూవీ నుంచి విడుద‌లైన టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక దీంతో పాటు నాని హీరోగా రాహుల్ సంక్రీత్య‌న్ తెర‌కెక్కిస్తోన్న శ్యామ్ సింగ‌రాయ్‌లో సాయి ప‌ల్ల‌వి న‌టించ‌నుంది. ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఇటీవల హైదరాబాద్ లో జరిగాయి.
    Published by:Manjula S
    First published:

    అగ్ర కథనాలు