Sai Pallavi: మెగా బ్రదర్స్‌కు సాయి పల్లవి షాక్.. చిరంజీవితో పాటు పవన్ సినిమాకు కూడా నో..

Sai Pallavi: మెగా హీరోలతో ఎప్పుడెప్పుడు నటించే అవకాశం వస్తుందా అని వేచి చూస్తుంటారు కొందరు హీరోయిన్లు. మెగా కంపౌండ్‌లోకి ఒక్కసారి ఎంటర్ అయితే చాలు వరసగా అందరితోనూ నటించొచ్చు అనే ప్లాన్స్ వేసుకుంటారు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 31, 2020, 9:05 PM IST
Sai Pallavi: మెగా బ్రదర్స్‌కు సాయి పల్లవి షాక్.. చిరంజీవితో పాటు పవన్ సినిమాకు కూడా నో..
చిరంజీవి పవన్ సాయి పల్లవి (chiranjeevi sai pallavi pawan)
  • Share this:
మెగా హీరోలతో ఎప్పుడెప్పుడు నటించే అవకాశం వస్తుందా అని వేచి చూస్తుంటారు కొందరు హీరోయిన్లు. మెగా కంపౌండ్‌లోకి ఒక్కసారి ఎంటర్ అయితే చాలు వరసగా అందరితోనూ నటించొచ్చు అనే ప్లాన్స్ వేసుకుంటారు ముద్దుగుమ్మలు. అందుకే మెగా ఆఫర్ కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తుంటారు. కానీ వచ్చిన అవకాశాన్ని వదిలేసుకోవడం మాత్రం అంత ఈజీగా జరగదు. కానీ ఇప్పుడు సాయి పల్లవి ఇదే చేసింది. ఒకటి కాదు వరసగా రెండు మెగా ఆఫర్స్ ఈమె వదిలేసిందనే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్. ఒకేసారి చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించే అవకాశం కాదనుకుంది ఈ ఫిదా బ్యూటీ. మెగా బ్రదర్స్ సినిమాల్లో రోల్స్ కాదనుకోవడం అంటే చిన్న విషయం కాదు.. కానీ సాయి పల్లవి మాత్రం చేసిందనే ప్రచారం జరుగుతుంది. అసలు విషయం ఏంటంటే.. పవన్ కళ్యాణ్ ఈ మధ్యే మలయాళ బ్లాక్‌బస్టర్ అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్‌లో నటించడానికి ఒప్పుకున్నాడు.
sai pallavi,sai pallavi pawan kalyan,sai pallavi says no to pawan kalyan movie,chiranjeevi,sai pallavi as sister for chiranjeevi,sai pallavi in chiranjeevi sister role,sai pallavi to act in chiranjeevi's sister role,chiranjeevi sai pallavi,sai pallavi in vedalam remake,chiranjeevi vedalam,పవన్ కళ్యాణ్ సాయి పల్లవి,చిరంజీవి సాయి పల్లవి,తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్, సాయి పల్లవి (Pawan Kalyan Sai Pallavi)


ఇందులో పవన్ భార్య పాత్రలో సాయి పల్లవిని నటింపచేయాలని ప్రయత్నించారు దర్శక నిర్మాతలు. అయ్యారే ఫేమ్ సాగర్ కే చంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. అయితే ఇందులో ఇద్దరు హీరోలుండటం.. హీరోయిన్‌కు స్క్రీన్ స్పేస్ కూడా తక్కువగానే ఉండటంతో పవన్ సరసన నటించడానికి నో చెప్పిందని తెలుస్తుంది. భారీ పారితోషికం ఆఫర్ చేసినా కూడా ఆసక్తి చూపించలేదని.. తన పాత్రకు అంత ప్రాధాన్యత లేకపోవడంతో పవన్ సినిమా అయినా పర్లేదని వదిలేసుకుందని సమాచారం.
sai pallavi,sai pallavi pawan kalyan,sai pallavi says no to pawan kalyan movie,chiranjeevi,sai pallavi as sister for chiranjeevi,sai pallavi in chiranjeevi sister role,sai pallavi to act in chiranjeevi's sister role,chiranjeevi sai pallavi,sai pallavi in vedalam remake,chiranjeevi vedalam,పవన్ కళ్యాణ్ సాయి పల్లవి,చిరంజీవి సాయి పల్లవి,తెలుగు సినిమా
చిరంజీవి,సాయి పల్లవి (Chiranjeevi Sai Pallavi/Photo)

మరోవైపు చిరంజీవి కమిట్ అయిన వేదాళం రీమేక్‌లో చెల్లి పాత్ర కోసం సాయి పల్లవి పేరు వినిపించింది. తమిళనాట అజిత్ చెల్లిగా లక్ష్మీ మీనన్ కనిపించింది. ఇదే పాత్ర కోసం సాయి పల్లవిని అడిగితే నో చెప్పింది. కథలో కీలకమే అయినా కూడా కొన్ని అనివార్య కారణాలతో వేదాళం రీమేక్ సాయి పల్లవి చేయడం లేదని తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఒకేసారి మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ లాంటి హీరోల సినిమాలకు నో చెప్పి ఇండస్ట్రీలో సంచలనాలకు మారుపేరుగా నిలిచింది ఈ కోయంబత్తూర్ బ్యూటీ.
Published by: Praveen Kumar Vadla
First published: October 31, 2020, 9:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading