• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SAI PALLAVI SAYS NO TO CHIRANJEEVI AND YES TO ALLU ARJUN HERE THE DETAILS PK

Allu Arjun Sai Pallavi: చిరుకు నో చెప్పి అల్లు అర్జున్‌కు ఓకే చెప్పిందా.. సాయి పల్లవి ఏం చేస్తుంది..?

Allu Arjun Sai Pallavi: చిరుకు నో చెప్పి అల్లు అర్జున్‌కు ఓకే చెప్పిందా.. సాయి పల్లవి ఏం చేస్తుంది..?

అల్లు అర్జున్ సాయి పల్లవి చిరంజీవి (allu arjun chiranjeevi)

Allu Arjun Sai Pallavi: సాధారణంగా చిరంజీవి సినిమాలో అవకాశం వస్తే ఏ హీరోయిన్ కూడా నో చెప్పదు. కానీ సాయి పల్లవి మాత్రం భిన్నం. అక్కడున్నది చిరంజీవి, రజినీకాంత్ అని కాదు.. తనకు ఆ పాత్ర సూట్ అవుతుందా లేదా అనేది మాత్రమే చూస్తుంది.

  • Share this:
సాధారణంగా చిరంజీవి సినిమాలో అవకాశం వస్తే ఏ హీరోయిన్ కూడా నో చెప్పదు. కానీ సాయి పల్లవి మాత్రం భిన్నం. అక్కడున్నది చిరంజీవి, రజినీకాంత్ అని కాదు.. తనకు ఆ పాత్ర సూట్ అవుతుందా లేదా అనేది మాత్రమే చూస్తుంది. నచ్చితే చిన్న హీరోలతో కూడా నటిస్తుంది.. నచ్చకపోతే చిరంజీవి సినిమా అయినా కూడా వదిలేస్తుంది. ఇప్పటికే అలా మహేష్ బాబు, చిరు సినిమాలను కూడా కాదనుకుంది సాయి పల్లవి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ భామ గురించి మరో సంచలన వార్త బయటికి వచ్చింది. అల్లు అర్జున్ సినిమాలో సాయి పల్లవి నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. రంగస్థలం లాంటి సంచలన సినిమా తర్వాత దర్శకుడు సుకుమార్‌‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రంలో రష్మికతో పాటు సాయి పల్లవి కూడా కనిపించబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బన్నీతో ఆర్య, ఆర్య 2 సినిమాలు చేసాడు బన్నీ. ఆ తర్వాత ‘పుష్ప’తో వస్తున్నారు ఈ జోడీ. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్యాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న పుష్ప షూటింగ్ ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది.
sai pallavi remuneration,sai pallavi chiranjeevi movie rejected,sai pallavi allu arjun movie,sai pallavi allu arjun pushpa,sai pallavi allu arjun sister,sai pallavi new movies,sai pallavi allu arjun movie,,సాయి పల్లవి,సాయి పల్లవి హాట్,సాయి పల్లవి యాడ్స్,సాయి పల్లవి పుష్ప అల్లు అర్జున్,సాయి పల్లవి అల్లు అర్జున్ చెల్లి
పుష్పలో అల్లు అర్జున్ Photo : Twitter

కరోనా కారణంగా బ్రేకుల మధ్య షూట్ జరుగుతుంది. ప్రస్తుతం మారేడుపల్లి అటవీ ప్రాంతంలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ చెల్లి పాత్రలో సాయి పల్లవి నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఇందులో నారా రోహిత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాత్రతోనే సినిమా కథ అంతా మలుపు తిరుగుతుందని తెలుస్తుంది. రివేంజ్ డ్రామాగానే పుష్ప వస్తుంది. ఆయనతో పాటు సాయి పల్లవి కూడా కీలక పాత్రలో నటించబోతుందని ప్రచారం జరుగుతుంది.
sai pallavi remuneration,sai pallavi chiranjeevi movie rejected,sai pallavi allu arjun movie,sai pallavi allu arjun pushpa,sai pallavi allu arjun sister,sai pallavi new movies,sai pallavi allu arjun movie,,సాయి పల్లవి,సాయి పల్లవి హాట్,సాయి పల్లవి యాడ్స్,సాయి పల్లవి పుష్ప అల్లు అర్జున్,సాయి పల్లవి అల్లు అర్జున్ చెల్లి
చిరంజీవి,సాయి పల్లవి (Chiranjeevi Sai Pallavi/Photo)

ఆ మధ్య చిరంజీవి వేదాళం రీమేక్‌లో చెల్లి పాత్ర కోసం అడిగితే నో చెప్పిన సాయి పల్లవి.. ఇప్పుడు అదే చెల్లి పాత్ర కోసం బన్నీ అడిగితే మాత్రం ఎస్ చెప్పిందని వార్తలొస్తున్నాయి. ఏదేమైనా కూడా చిరుకు నో చెప్పి.. బన్నీకి ఎస్ చెప్తే మాత్రం సోషల్ మీడియాలో కచ్చితంగా ట్రోలింగ్స్ మొదలవుతాయి. ప్రస్తుతం వేణు ఉడుగుల విరాట పర్వం సినిమాతో పాటు శేఖర్ కమ్ముల, నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమాల్లో నటిస్తుంది సాయి పల్లవి.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు