SAI PALLAVI ROWDY BABY FROM MAARI 2 MOVIE CREATS 900 MILLON VIEWS IN YOUTUBE THIS IS NEW RECORD IN SOUTH FILM INDUSTRY TA
సాయిపల్లవి సినీ కెరీర్లో మరో అరుదైన రికార్డు.. సౌత్‌లో ఈ ఫీట్ అందుకున్న ఫస్ట్ హీరోయిన్..
సాయి పల్లవి Photo : Twitter
సాయి పల్లవి.. తన సినీ కెరీర్లో మరో అరుదైన రికార్డు అందుకుంది. దక్షిణాదిలో ఈ ఫీట్ అందుకున్న తొలి హీరోయిన్గా రికార్డులకు ఎక్కింది. వివరాల్లోకి వెళితే..
సాయి పల్లవి.. తన సినీ కెరీర్లో మరో అరుదైన రికార్డు అందుకుంది. దక్షిణాదిలో ఈ ఫీట్ అందుకున్న తొలి హీరోయిన్గా రికార్డులకు ఎక్కింది. వివరాల్లోకి వెళితే.. మలయాళ సినిమా ’ప్రేమమ్’ సినిమాతో అడుగుపెట్టి.. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఈ సినిమాలో వచ్చిండే.. మెల్లమెల్లగా వచ్చిండే.. ఈ పాట తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో..? ‘ఫిదా’ సినిమాలోని ఈ పాటకు అంతా ఫిదా అయిపోయారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీకి తోడు సాయిపల్లవి డాన్సులకు నిజంగానే అంతా ఫిదా అయిపోయారు. ఈ పాట మొన్నటి వరకు తెలుగులో యూట్యూబ్‌లో అత్యధికంగా చూసిన పాటగా ఉండేది. తాజాగా అల్లు అర్జున్, పూజా హెగ్డే ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్ ఈ రికార్డును అధిగమించింది. కానీ ఓ రికార్డు మాత్రం ఇప్పటికీ సాయి పల్లవి ఖాతాలో ఉంది. ఈమె ధనుశ్ హీరోగా నటించిన ‘మారి 2’ సాంగ్ తాజాగా మరో రికార్డు అందుకుంది.
ధనుష్ హీరోగా మారి 2లో ఉన్న రౌడీ బేబీ పాట యూట్యూబ్‌లో దుమ్ము దులిపేస్తుంది. ఈ పాట తాజాగా యూట్యూబ్‌లో 900 మిలియన్ వ్యూస్ అందుకోని దక్షిణాదిలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. అంటే ఇప్పటి వరకు ఈ పాటను యూట్యూబ్‌లో 90 కోట్ల వ్యూస్ వచ్చాయన్నా పాట. ఈ పాట యేడాది క్రితం యూట్యూబ్‌లో అప్లోడ్ చేపినప్పటి నుంచి అన్ని భాషల వాళ్లను అలరిస్తూనే ఉంది. ఈ సినిమాలోని రౌడీ బేబి పాటతో సాయి పల్లవికి రౌడీ బేబి అనే బిరుదు కూడా వచ్చేసింది. సౌత్‌లో ఇప్పటి వరకు ఏ పాట ఇన్ని మిలియన్ వ్యూస్ దక్కించుకోలేదు. ఇదే ఊపును ఈ పాట కంటిన్యూ చేస్తే 1000 మిలియన్ వ్యూస్ (100 కోట్ల వ్యూస్) దక్కడం ఎంతో దూరంలో ఉండదు. మొత్తానికి మారిలో సాయి పల్లవి డాన్స్ బీట్స్‌కు ఆరు నుంచి అరవై వరకు అంతా ఆ పాటకు నిజంగానే ఫిదా అయిపోయారు. మొత్తానికి సాయిపల్లవి రౌడీబేబీ దెబ్బకు ఇప్పుడు అన్ని రికార్డులు ఫసక్ అయిపోయాయి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.