Sai Pallavi remuneration : నయనతారకు పోటీగా సాయి పల్లవి.. భారీగా డిమాండ్..

Sai Pallavi remuneration : రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్‌లో నాచురల్ స్టార్ నాని 'శ్యామ్ సింగ రాయ్' ( Shyam Singha Roy ) అనే సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

news18-telugu
Updated: September 17, 2020, 9:46 AM IST
Sai Pallavi remuneration : నయనతారకు పోటీగా సాయి పల్లవి.. భారీగా డిమాండ్..
సాయి పల్లవి Photo : Twitter
  • Share this:
Sai Pallavi : సాయి పల్లవి అందగత్తే కాదు మంచి నటి కూడా. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. ఆ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టింది. అంతేకాదు తాను ఎంచుకున్న సినిమాల ద్వారా మంచి నటిగాను పాత్రకు తగ్గట్లు హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు తెచ్చుకుంది. ఈ భామ ప్రస్తుతం తెలుగులో 'విరాట పర్వం' అనే సినిమాను చేస్తోంది. ఈ సినిమాను వేణు ఊడుగుల (నీది నాది ఒకే కథ ఫేమ్‌) దర్శకత్వం వహిస్తున్నారు. రానా హీరోగా చేస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్‌ ప్రేమకథగా, రాజకీయ థ్రిల్లర్‌గా వస్తోంది. రానా రాజకీయ నాయకుడిగాను, సాయిపల్లవి పేదింటి యువతిగా కనిపించనున్నది. సాయి పల్లవి తెలుగులో మరో సినిమాలోను నటిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమాలో సాయి పల్లవి నటిస్తోంది. నాగ చైతన్య హీరోగా చేస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో పాటు సాయి పల్లవి.. నాని హీరోగా శ్యామ్ సింగరాయ్ పేరుతో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోంది. యువ దర్శకుడు విజయ్ దేవరకొండ టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్‌ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాలో నటించడానికి గాను సాయి పల్లవి 2 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటున్నట్టు సమాచారం. సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది. అయితే ఈ సినిమాలో సాయి పల్లవి కథ ప్రకారం పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుందని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాతో పాటు శర్వానంద్ హీరోగా ఆర్ ఎక్స్ 100 ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రంలో కీలక పాత్రలో కనిపించనుంది సాయి పల్లవి. ఇటు సినిమాలతో పాటు సాయి పల్లవి ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. పరువు హత్యల బ్యాక్‌డ్రాప్‌లో ఓ తమిళ వెబ్‌ సిరీస్‌ రాబోతోంది. నాలుగు కథల సమాహారంగా రూపొందనున్న ఈ వెబ్‌సిరీస్‌కి గౌతమ్‌ మీనన్‌, వెట్రిమారన్‌, సుధా కొంగర, విఘ్నేష్‌ శివన్‌ వంటి ప్రముఖ తమిళ దర్శకులు డైరెక్ట్‌ చేయబోతున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో నాలుగు భిన్న కథలు, భిన్న నేపథ్యాలు ఉన్నప్పటికీ ప్రతి కథలోని చర్చించే అంశం మాత్రం పరువు హత్యల గురించే ఉండనుంది. ఇక దేశ వ్యాప్తంగా జరిగిన పరువు హత్యల్లో ముఖ్య మైన ఘటనల్నీ ఈ వెబ్ సిరీస్‌లో చర్చిస్తారట. అందులో భాగంగా ఇటీవల సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్యను కూడా చర్చించనున్నారట. ఈ కథను ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్‌ తెరకెక్కించానున్నాడని తెలుస్తోంది.
Published by: Suresh Rachamalla
First published: September 17, 2020, 9:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading