Pawan Kalyan- Sai Pallavi: పవన్ సినిమాకు నో చెప్పిన సాయి పల్లవి.. కారణం ఇదేనా
పవన్ కళ్యాణ్, సాయి పల్లవి (Pawan Kalyan Sai Pallavi)
Pawan Kalyan- Sai Pallavi: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వకీల్ సాబ్ షూటింగ్‌ని పూర్తి చేసుకున్న పవన్.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ మూవీలో.. అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్‌లో మరో చిత్రంలో నటిస్తున్నారు. మలయాళంలో మంచి విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియుమ్‌కి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు
Pawan Kalyan- Sai Pallavi: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వకీల్ సాబ్ షూటింగ్‌ని పూర్తి చేసుకున్న పవన్.. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ మూవీలో.. అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్‌లో మరో చిత్రంలో నటిస్తున్నారు. మలయాళంలో మంచి విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియుమ్‌కి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్‌తో పాటు రానా కూడా నటిస్తున్నారు. కాగా ఈ మూవీలో పవన్ సరసన హీరోయిన్గా సాయి పల్లవిని ఫైనల్ చేసినట్లు ఆ మధ్యన వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి సాయి పల్లవి డేట్లు కూడా ఇచ్చినట్లు టాక్ నడిచింది. కానీ తాజాగా ఫిలింనగర్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్‌కి సాయి పల్లవి నో చెప్పినట్లు తెలుస్తోంది.
వేరే ప్రాజెక్ట్‌లను ఒప్పుకోవడం వలన ఈ ప్రాజెక్ట్ నుంచి సాయి పల్లవి తప్పుకున్నట్లు టాక్. అయితే ఆమె ఈ ప్రాజెక్ట్‌కి నో చెప్పడానికి మరో కారణం ఉందని.. ఇందులో తన పాత్ర నిడివి తక్కువగా ఉండటంతో పాటు పెద్దగా ప్రాధాన్యం ఉండదనే ఈ రీమేక్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంతో తెలీదు గానీ.. ప్రస్తుతం పవన్ కోసం మూవీ యూనిట్ మరో హీరోయిన్ని సంప్రదిస్తున్నట్లు సమాచారం.
కాగా సాయి పల్లవి ప్రస్తుతం రానా సరసన విరాట పర్వంలో నటిస్తోంది. తాజాగా ఇందులోని కోలో కోలోయమ్మ పాట విడుదల కాగా.. అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ మూవీతో పాటు నాగ చైతన్య సరసన లవ్ స్టోరీలో నటించింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన రెండు పాటలు ఆకట్టుకోగా.. తాజాగా వచ్చిన దాని పేరే సారంగ దరియా యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. లిరికల్ వీడియోగానే వచ్చినప్పటికీ.. ఇందులో సాయి పల్లవి స్టెప్పులు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇక వీటితో పాటు నాని సరసన శ్యామ్ సింగరాయ్‌లో నటిస్తోంది ఈ మలార్ బ్యూటీ. ఈ మూడు చిత్రాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.