• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SAI PALLAVI REJECTED ONE CRORE AD OFFER BECOME HOT TOPIC IN FILM CIRCLES AK

భారీ ఆఫర్‌... టెంప్ట్ అవ్వని సాయిపల్లవి

భారీ ఆఫర్‌... టెంప్ట్ అవ్వని సాయిపల్లవి

సాయి పల్లవి (Sai Pallavi)

తనకు నచ్చని కథలను ఏ మాత్రం ఒప్పుకోని మనస్తత్వం ఉన్న సాయిపల్లవి... యాడ్స్ విషయంలో తాను ఇలాగే వ్యవహరిస్తానని మరోసారి క్లారిటీ ఇచ్చిందని తెలుస్తోంది.

  • Share this:
    మన సినిమా స్టార్స్ యాడ్స్‌లో నటించేందుకు ఎంతగా ఆసక్తి చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వచ్చే యాడ్స్‌లో నటించేందుకు క్రేజీ స్టార్స్‌తో అప్ కమింగ్ నటులు కూడా తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే కొందరు నటులు మాత్రం తమ మనసుకు నచ్చకపోతే... ఎంత డబ్బు ఇచ్చినా యాడ్స్‌లో నటించడానికి ఒప్పుకోరు. సినిమా కథలను ఎంపిక చేసుకున్నట్టే... యాడ్స్ విషయంలోనూ స్ట్రిక్ట్‌గా ఉంటారు. అందాల భామ సాయిపల్లవి సైతం ఓ యాడ్ విషయంలో ఇలాగే వ్యవహరించిందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

    తనకు నచ్చని కథలను ఏ మాత్రం ఒప్పుకోని మనస్తత్వం ఉన్న సాయిపల్లవి... యాడ్స్ విషయంలో తాను ఇలాగే వ్యవహరిస్తానని మరోసారి క్లారిటీ ఇచ్చిందని తెలుస్తోంది. తాజాగా ఓ పెద్ద వస్త్ర కంపెనీ నుంచి వచ్చిన ఆఫర్ ను కూడా ఆమె రిజక్ట్ చేసింది. ఏడాది పాటు బ్రాండ్ అంబాసడార్ గా వుంటే కోటి రూపాయలు ఇస్తామన్నారట. అయినా సాయిపల్లవి మాత్రం ఈ ఆఫర్ నచ్చక తిరస్కరించిందని సమాచారం. మొత్తానికి సినిమా అయినా... యాడ్ అయినా... తనకు నచ్చితేనే చేస్తానని ఈ కేరళ బ్యూటీ మరోసారి చాటిచెప్పిందని చెప్పొచ్చు.
    Published by:Kishore Akkaladevi
    First published: