• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SAI PALLAVI REJECTED BELLAMKODA SAI SREENIVAS HINDI REMAKE HERE ARE THE DETAILS SR

Sai Pallavi : సాయిపల్లవి బెల్లంకొండ సినిమాను వదిలేసిందా.. కారణం ఏమిటి..

Sai Pallavi : సాయిపల్లవి బెల్లంకొండ సినిమాను వదిలేసిందా.. కారణం ఏమిటి..

సాయి పల్లవి Photo : Instagram

Sai Pallavi : సాయి పల్లవి ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కాగా తాజాగా ఆమెకు బెల్లంకొండ శ్రీనివాస్ సరసన హీరోయిన్‌గా మరో అవకాశం వచ్చినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

  • Share this:
    Sai Pallavi : సాయి పల్లవి ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కాగా తాజాగా ఆమెకు బెల్లంకొండ శ్రీనివాస్ సరసన హీరోయిన్‌గా మరో అవకాశం వచ్చినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆఫర్‌ను సాయి పల్లవి రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది. బెల్లంకొండ హిందీలో ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన చత్రపతిని రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు వి వి వినాయక్ దర్శకుడు. మొదట ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తుందని టాక్ నడిచింది. అయితే ఆమె కూడా పలు సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమాను వదులుకుందట. దీంతో టీమ్ సాయి పల్లవిని సంప్రదించిందట. కానీ సాయి పల్లవి కూడా ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో నటిస్తూ సూపర్ బిజీగా ఉంది. ఆమె ప్రస్తుతం నాగ చైతన్య సరసన లవ్ స్టోరిలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు సాయి పల్లవి రానా ప్రధాన పాత్ర పోషిస్తున్న విరాటపర్వంలో కూడా కీలకపాత్రలో కనిపించనుంది. ఈ రెండు సినిమాలతో పాటు సాయి పల్లవి నాని హీరోగా వస్తున్న శ్యామ్ సింగ రాయ్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతోంది. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకుడు.

    ఇక సాయి పల్లవి నటన విషయానికి వస్తే.. ఆమె గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. విభిన్నమైన పాత్రలను పోషిస్తూ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మలయాళం 'ప్రేమమ్' సినిమాతో సౌత్‌లో మంచి క్రేజ్ దక్కించుకుంది. సాయి పల్లవి అందగత్తే కాదు మంచి నటి కూడా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. ఆ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ పల్లెటూరు అమ్మాయిగా అదరగొట్టింది. సాయి పల్లవి తాను ఎంచుకున్న సినిమాల ద్వారా మంచి నటిగా పాత్రకు తగ్గట్లు హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు తెచ్చుకుంది. ఆ సినిమాలో భానుమతి పాత్ర లో సాయి పల్లవి చెప్పిన డైలాగులు సినిమాకే హైలెట్ అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ సినిమా తర్వాత నానితో 'ఎంసీఏ' సినిమాతో కూడా మంచి విజయం సాధించడం జరిగింది. అయితే ఆ తర్వాత వచ్చిన 'ఎన్జీకె', 'పడి పడి లేచె మనసు' సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో కొంత నిరుత్సాహాపడిన మళ్లి పుంజుకుని వరుస సినిమాలతో అదరగొడుతోంది. ఇక తాజాగా సాయి పల్లవికి బెల్లంకొండ శ్రీనివాస్ సరసన అవకాశం రాగా.. ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో ఆమె ఈ సినిమాను వదిలేసిందని టాక్ నడుస్తోంది.

    ఇక బెల్లంకొండ విషయానికి వస్తే.. ఈ సినిమాతో పాటు బెల్లంకొండ మరో రీమేక్‌లో నటించనున్నట్లు టాక్ నడుస్తోంది. తమిళ్‌లో ఇటీవల విడుదల ధనుష్ కర్ణన్‌ తెలుగు రీమేక్‌లో బెల్లంకొండ నటిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి కర్ణన్ రీమేక్ రైట్స్‌ను బెల్లంకొండ సురేష్ కొన్నట్లు తెలుస్తోంది.
    Published by:Suresh Rachamalla
    First published: