ఎన్ని ఫ్లాపులు వచ్చినా కూడా ఎందుకో తెలియదు కానీ సాయిపల్లవి సినిమా అంటే చాలు ప్రేక్షకుల్లో ఏదో తెలియని ఆసక్తి ఉంటుంది. ఇప్పటికీ ఇదే కంటిన్యూ అవుతుంది కూడా. ఫిదా తర్వాత ఎంసిఏ హిట్ అయినా.. పడిపడి లేచే మనసు, మారి 2, ఎన్జీకే సినిమాలతో హ్యాట్రిక్ ఫ్లాపులు అందుకుంది సాయిపల్లవి. దాంతో ఇప్పటికిప్పుడు హిట్ కొట్టి తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితుల్లో పడిపోయింది పల్లవి. ఇన్ని ఫ్లాపులు వచ్చినా కూడా సాయిపల్లవి అవకాశాల వేటలో మాత్రం ముందే ఉంది. చాలా రోజుల కిందే విరాట పర్వం 1992 సినిమాకు ఓకే చెప్పింది సాయిపల్లవి.

మారి 2 రౌడీ బేబి సాంగ్
నీదినాది ఒకేకథ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వేణు ఉడుగుల ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా ఓపెనింగ్ జూన్ 15 ఉదయం 10.30 నిమిషాలకు రామానాయుడు స్టూడియోస్‌లో జరగనుంది. ఇదే విషయాన్ని అఫీషియల్‌గా ఫేస్ బుక్ పేజీలో అప్ డేట్ చేసాడు దర్శకుడు వేణు. సాయిపల్లవి ఇందులో నక్సలైట్ పాత్రలో నటించబోతుంది. ఎవరూ కనీసం ఊహించని విధంగా ఏకంగా ఓ నక్సలైట్ పాత్రలో ఊహించుకున్నాడు దర్శకుడు వేణు. సాయిపల్లవి నక్సలైట్ అంటే నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది. అసలు ఆమెలో ఓ నక్సల్‌ను చూడటం చిన్న విషయం కాదు.

రానా సాయిపల్లవి ఫైల్ ఫోటోస్
అంత ధైర్యం కూడా ఏ దర్శకుడు చేయడు. కానీ అమ్మడు నటనపై ఉన్న నమ్మకంతో దర్శకులు మాత్రం డేరింగ్ రోల్స్ ఆమె కోసం రాసుకుంటున్నారు. ఇదే ధైర్యంతో ఇప్పుడు ముందుకెళ్తున్నాడు వేణు ఉడుగుల. ‘నీదినాది ఒకేకథ’లో పిల్లలపై మీ భావాల్ని రుద్దకండి అంటూ తల్లిదండ్రులకు బాగా గట్టిగా చెప్పాడు ఈ దర్శకుడు. కమర్షియల్‌గా ఊహించిన విజయం సాధించలేదు కానీ సినిమా మాత్రం ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు తన రెండో సినిమాను సాయిపల్లవితో ప్లాన్ చేస్తున్నాడు వేణు. ఈ సినిమా పూర్తిగా లేడీ ఓరియెంటెడ్‌గా తెరక్కబోతుంది. ఈ చిత్రంలో సాయిపల్లవితో పాటు రానా నటించబోతున్నాడు.
ఈయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నాడని.. సాయిపల్లవి, రానా మధ్య వచ్చే సీన్స్ అద్భుతంగా ఉంటాయని తెలుస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి కాగా ఇన్నాళ్లూ రానా కోసం వేచి చూసారు. ఇప్పుడు ఈయన కూడా రావడంతో ముహూర్తం పెడుతున్నారు. సాయిపల్లవి ఈ పాత్రను ఛాలెంజింగ్‌గా తీసుకుంటుందనడటంలో ఆశ్చర్యం అయితే లేదు. ‘పడిపడి లేచె మనసు’ పరాజయంతో కాస్త నిరాశపడిన సాయిపల్లవి.. ఈ సినిమాతో మళ్లీ సంచలనం సృష్టించాలని చూస్తుంది. మరి నక్సలైట్ పాత్రలో పల్లవి ఏ మేరకు మాయ చేస్తుందో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:June 14, 2019, 19:39 IST