Sai Pallavi : అమృత ప్రణయ్‌ల జీవితం ఆధారంగా వెబ్ సిరీస్.. ప్రధాన పాత్రల్లో సాయి పల్లవి.. ప్రకాష్ రాజ్

సాయి పల్లవి, ప్రకాష్ రాజ్ Photo : Twitter

Web Series on Honor killing : నాలుగు కథల సమాహారంగా పరువు హత్యల బ్యాక్‌డ్రాప్‌లో వెబ్‌ సిరీస్‌ రాబోతోంది.

 • Share this:
  Sai Pallavi : సాయి పల్లవి అందగత్తే కాదు మంచి నటి కూడా. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. ఆ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టింది. అంతేకాదు తాను ఎంచుకున్న సినిమాల ద్వారా మంచి నటిగాను పాత్రకు తగ్గట్లు హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు తెచ్చుకుంది. ఈ భామ ప్రస్తుతం తెలుగులో 'విరాట పర్వం' అనే సినిమాను చేస్తోంది. ఈ సినిమాను వేణు ఊడుగుల (నీది నాది ఒకే కథ ఫేమ్‌) దర్శకత్వం వహిస్తున్నారు. రానా హీరోగా చేస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్‌ ప్రేమకథగా, రాజకీయ థ్రిల్లర్‌గా వస్తోంది. రానా రాజకీయ నాయకుడిగాను, సాయిపల్లవి పేదింటి యువతిగా కనిపించనున్నది. సాయి పల్లవి తెలుగులో మరో సినిమాలోను నటిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమాలో సాయి పల్లవి నటిస్తోంది. నాగ చైతన్య హీరోగా చేస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా విడుదలను వాయిదా వేసుకుంది. ఈ సినిమాలతో పాటు సాయి పల్లవి ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. పరువు హత్యల బ్యాక్‌డ్రాప్‌లో ఓ తమిళ వెబ్‌ సిరీస్‌ రాబోతోంది.

  నాలుగు కథల సమాహారంగా రూపొందనున్న ఈ వెబ్‌సిరీస్‌కి గౌతమ్‌ మీనన్‌, వెట్రిమారన్‌, సుధా కొంగర, విఘ్నేష్‌ శివన్‌ వంటి ప్రముఖ తమిళ దర్శకులు డైరెక్ట్‌ చేయబోతున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో నాలుగు భిన్న కథలు, భిన్న నేపథ్యాలు ఉన్నప్పటికీ ప్రతి కథలోని చర్చించే అంశం మాత్రం పరువు హత్యల గురించే ఉండనుంది. ఇక దేశ వ్యాప్తంగా జరిగిన పరువు హత్యల్లో ముఖ్య మైన ఘటనల్నీ ఈ వెబ్ సిరీస్‌లో చర్చిస్తారట. అందులో భాగంగా ఇటీవల సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్యను కూడా చర్చించనున్నారట. ఈ కథను ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్‌ తెరకెక్కించానున్నాడని తెలుస్తోంది. అయితే ఈ కథలో ప్రణయ్ భార్య అమృతగా సాయిపల్లవి నటిస్తోండగా.. ఆమె తండ్రి మారుతీరావుగా ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్‌ నటిస్తున్నారని సమాచారం. ఇదే కథతో మరో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కూడా 'మర్డర్‌' పేరుతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

  ఇక సాయి పల్లవి ఇతర సినిమాల విషయానికి వస్తే ఆమె తాజాగా మరో అవకాశాన్ని అందిపుచ్చుకున్నట్లుగా తెలుస్తోంది. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్‌కు జోడిగా మహా సముద్రంలో నటించనుందని సమాచారం.  ఈ సినిమాతో పాటు నాని హీరోగా వస్తోన్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో ఓ హీరోయిన్‌గా అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.
  Published by:Suresh Rachamalla
  First published: