ట్రెండ్ మారింది.. స్టార్ హీరోయిన్లు సైతం ఐటెం సాంగ్స్ (Item Songs) చేస్తూ ఊపు ఊపేస్తున్నారు. ఒకప్పుడు సినిమాలో స్పెషల్ సాంగ్ అంటే సపరేట్‌గా ఓ బ్యూటీని తీసుకొచ్చేవారు. కానీ రీసెంట్ మూవీస్ చూస్తే ఆ పరిస్థితి కనిపించడం లేదు. స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్లతో స్పెషల్ సాంగ్స్ షూట్ చేసి తమ సినిమా క్రేజ్ పెంచుకుంటున్నారు. ఇప్పటికే తమన్నా (Tamanna), పూజా హెగ్డే (Pooja Hegde), సమంత (Samantha) లాంటి ఎందరో టాప్ హీరోయిన్స్ ఈ స్పెషల్ సాంగ్స్‌లో కాలు కదిపారు. దీంతో చాలామంది యంగ్ హీరోయిన్లకు పలు సందర్భాల్లో మీరు ఐటెం సాంగ్స్ చేస్తారా అనే ప్రశ్న కామన్‌గా ఎదురవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇదే ప్రశ్నపై సాయి పల్లవి (Sai Pallavi) ఆసక్తికరంగా స్పందిస్తూ మనసులో మాట బయటపెట్టింది.
నాచులర్ బ్యూటీగా దక్షిణాదిలో సాయి పల్లవి క్రేజే వేరు. ఆమె డాన్స్ చేసిందంటే ఫ్లోర్స్ దద్దరిల్లి పోవాల్సిందే. ఆశ్చర్యపరిచే ఎనర్జీతో కెమెరా ముందు స్టెప్పులేస్తోంది సాయి పల్లవి. ఆమె డాన్స్ నెంబర్ అంటే కంటిపై రెప్ప వాల్చకుండా చూస్తుంటారు ప్రేక్షకులు. అలాంటి సాయి పల్లవి ఐటెం సాంగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. తాజా ఇంటర్వ్యూలో
సాయి పల్లవికి సరిగ్గా ఇదే ప్రశ్న ఎదురైంది. పుష్ప సినిమాలో సమంత చేసిన 'ఊ అంటావా మావ', రంగస్థలం మూవీలో పూజా హెగ్డే చేసిన జిగేలు రాణి లాంటి సాంగ్స్‌లో డాన్స్ చేసే ఆఫర్ వస్తే చేస్తారా? అని ప్రశ్నించగా.. అస్సలు కుదరని కుండబద్దలు కొట్టేసింది సాయి పల్లవి.
ఐటెం సాంగ్స్ తనకు కంఫర్ట్‌గా అనిపించవని చెప్పిన ఈ నాచురల్ అందం.. భవిష్యత్‌లో ఒకవేళ అలాంటి ఆఫర్స్ వచ్చినా చేసేదే లేదని చెప్పుకొచ్చింది. ఐటెం సాంగ్స్ కోసం వేసే డ్రెస్సింగ్ తనకు కంఫర్ట్ అనిపించదు కాబట్టే వాటికి దూరంగా ఉంటానని తెలిపింది. తనకు అలాంటి పాటలంటే పెద్దగా ఆసక్తి కూడా ఉందని చెబుతూ ఆమె ఓపెన్ అయింది. దీన్ని బట్టి చూస్తే సాయి పల్లవిని ఐటెం నెంబర్‌లో చూసే ఛాన్సే లేదని స్పష్టమవుతోంది.
అందం, అందుకు తగ్గ అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి.. ఇటీవల నాని హీరోగా రూపొందిన శ్యామ్ సింగరాయ్‌లో నటించింది. ఇకపోతే దగ్గుబాటి రానాతో కలిసి ఆమె నటించిన విరాట పర్వం సినిమా జూలై 1వ తేదీన విడుదల కాబోతోంది. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో ఏ సినిమాలు లేవని సమాచారం. నటన పరంగా తనకంటూ కొన్ని పరిమితులు పెట్టుకున్న ఆమె కథలో తన రోల్ నచ్చితేనే ఓకే చేస్తానని అంటోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pooja Hegde, Sai Pallavi, Samantha Ruth Prabhu, Virata Parvam