పాపం సాయి పల్లవి... ఆమెకే ఎందుకు ఇలా జరుగుతోంది..

Sai Pallavi :  'ఫిదా' సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టింది.

news18-telugu
Updated: December 28, 2019, 7:54 AM IST
పాపం సాయి పల్లవి... ఆమెకే ఎందుకు ఇలా జరుగుతోంది..
సాయి పల్లవి Photo : Twitter
  • Share this:
Sai Pallavi :  'ఫిదా' సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టింది. సాయి పల్లవి.. తాను ఎంచుకున్న సినిమాల ద్వారా.. పాత్రల ద్వారా మంచి నటిగా.. పాత్రకు తగ్గట్లు హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు సంపాదించింది. నటనలో గానీ, లేదా అందంలో గాని ఈ భామకు సాటిలేరు. సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో 'విరాట పర్వం' అనే సినిమాను చేస్తోంది. వేణు ఊడుగుల (నీది నాది ఒకే కథ ఫేమ్‌) దర్శకత్వం వహిస్తున్నారు. రానా హీరోగా చేస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్‌ ప్రేమకథగా, రాజకీయ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాలో రానా రాజకీయ నాయకుడిగాను, సాయిపల్లవి పేదింటి యువతిగా కనిపించనున్నది అనేది సమాచారం. సాయి పల్లవి తెలుగులో మరో సినిమాలోను నటిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమాలో నాగచైతన్యకు జోడిగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఈ రెండు సినిమాలే ఉన్నాయనేది టాక్. మంచి నటి దానికితోడు చక్కని అందగత్తే అయినా కూడా తన టాలెంట్‌కు తగ్గ సినిమా అవకాశాలు రావట్లేదని బాధ పడుతున్నారు ఆమె అభిమానులు.

సాయి పల్లవి చేతిలో ప్రస్తుతం తమిళ సినిమాలు కూడా ఏమీ లేవు. ఆ మధ్య తమిళంలో సూర్య సరసన నటించిన 'ఎన్‌జీకే' చిత్రంలో సాయి పల్లవి నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర అలరించలేకపోయింది. దీంతో ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్న.. సాయి పల్లవికి ఆ సినిమా తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఆ సినిమా కంటే ముందు ధనుష్‌తో జతకట్టి ఆడి పాడిన 'మారి 2' సినిమా మంచిగానే ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంది. అంతేకాదు ఆ సినిమాలో 'రౌడీ బేబి' పాట యూట్యూబ్‌ ప్రేక్షకులను విశేషంగా అలరించి రికార్డ్స్ సృష్టించింది. ఇంతగా తన నటన, డాన్స్‌తో అదరగొడుతున్న కూడా ఈ భామకు తమిళంలో ప్రస్తుతానికి ఒక్క అవకాశం లేదు. కారణం ఏమై ఉంటుందని తెగ బాధ పడుతున్నారు సాయి పల్లవి అభిమానులు. నటనలో గాని, లేదా డ్యాన్స్‌లో గాని ఏ హీరోకు తగ్గని టాలెంట్ ఆమె సొంతం. అయితే తన టాలెంట్ తనకు శాపంగా మారిందా.. అంతటి టాలెంట్ ఉన్న అమ్మాయితో నటించలేకే ఆమెను వద్దనడం వలన అవకాశాలు తగ్గాయా.. అని చర్చించుకుంటున్నారు ఆమె అభిమానులు. మరోవైపు తనకున్న పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ కూడా అవకాశాలు రావకపోవాడానికి మరో కారణమై ఉండోచ్చు.
Published by: Suresh Rachamalla
First published: December 28, 2019, 7:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading