సమంత, రానాకు సవాల్ విసిరిన సాయి పల్లవి ..

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఒకరి నుంచి మరొకరు గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తున్నారు. తాజాగా సాయి పల్లవి..రానా, సమంతకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

news18-telugu
Updated: October 12, 2019, 8:46 PM IST
సమంత, రానాకు సవాల్ విసిరిన సాయి పల్లవి ..
రానా, సమంతలకు సాయి పల్లవి గ్రీన్ ఛాలెంజ్ (Twitter/Photos)
  • Share this:
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఒకరి నుంచి మరొకరు గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడాలనే సృహలో చాలా మంది సెలబ్రిటీలు గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటుతున్నారు. తాము మొక్కలు నాటడమే కాకుండా.. తమ తోటి నటీనటులను మొక్కలు పెంచేలా ప్రోత్సహిస్తూ గ్రీన్ ఛాలెంజ్ విసురుతున్నారు. తాజాగా కథానాయిక సాయి పల్లవి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సమంత అక్కినేనితో పాటు రానా దగ్గుబాటిని నామినేట్ చూశారు. ఇప్పటికే ఎంపీ సంతోష్ కుమార్.. అక్కినేని అఖిల్‌తో పాటు వరుణ్ తేజ్‌కు గ్రీన్ చాలెంజ్ విసిరారు. గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా వరుణ్ తేజ్.. తమన్నాను, సాయి పల్లవికి ఈ సవాల్ విసిరారు.తాజాగా సాయి పల్లవి.. వరుణ్ తేజ్ నుంచి ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటారు. అంతేకాదు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవఱణలో మొక్కలు నాటాలని ఆమె తెలిపారు. తాజాగా అనంతరం ఆమె ఈ చాలెంజ్ కోసం సమంత, రానాను నామినేట్ చేశారు. తాజాగా సాయి పల్లవి విసిరిన ఛాలెంజ్‌ను రానా స్వీకరించి ‘సరే బాస్’ అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీళ్లిద్దరు ‘విరాట పర్వం 1992’లో నటించారు. ఈ సినిమాను వేణు ఊడుగుల దర్శకత్వంల వహిస్తున్నారు.
First published: October 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>