నేచురల్ హీరోయిన్ సాయి పల్లవి వరుస సినిమాలతో బిజీగా మారింది. లవ్ స్టోరీ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ భామ.. ఇప్పుడు బ్రేక్ లేకుండా సినిమాలు తీస్తుంది. విరాట పర్వం సినిమాతో ప్రేక్షకులను అలరించిన లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి మరో సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా మలయాళీ బ్యూటీ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘గార్గి’. ఈ మూవీ విడుదల తేదీని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది సాయి పల్లవి.
గార్గి చిత్రాన్ని జులై 15న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. మొత్తం మూడు భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇటీవల సాయి పల్లవి బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, మేకింగ్ వీడియోలకు మంచి స్పందన వచ్చింది.
ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, సాయి పల్లవి ఫస్ట్ లుక్, మేకింగ్ వీడియోలు ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. చీరకట్టులో చేతిలో బ్యాగ్.. న్యాయం కోసం ఎదురుచూస్తున్న మహిళగా ఆ పోస్టర్ ఉంది. ఓ మహిళ ప్రయాణాన్ని.. ఆమె పడిన కష్టాల ఆధారంగా దీనిని రూపొందించినట్లు అర్థమవుతోంది.
#Gargi will be Yours from the 15th of July! @prgautham83 @kaaliactor @SakthiFilmFctry @2D_ENTPVTLTD pic.twitter.com/Gg9w5JCgPl
— Sai Pallavi (@Sai_Pallavi92) July 2, 2022
‘96’ ఫేం గోవింద్ వసంత్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రవిచంద్రన్ రామచంద్రన్, ఐశ్వర్య లక్ష్మీ, థామస్ జార్జ్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సాయి పల్లవి లుక్ సినిమా హైప్ క్రియేట్ చేస్తోంది. గార్గి చిత్రాన్ని తమిళంలో 2డీ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై హీరో సూర్య, జ్యోతిక విడుదల చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sai Pallavi, Tollywood