తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ న్యాచురల్ నటుల్లో నాని, సాయి పల్లవి ముందుంటారు. వీళ్లు స్క్రీన్‌పై కనిపించే తీరు.. నటించే జోరు చూస్తుంటే అబ్బో అనిపిస్తుంది ఎవరికైనా. అలాంటి ఇద్దరూ కలిసి నటిస్తే అంతకంటే అభిమానులకు కావాల్సింది ఏం ఉంటుంది చెప్పండి..? అందుకే అప్పట్లో ఎంసిఏ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా నాని, సాయి పల్లవి రేంజ్‌నే బ్లాక్‌బస్టర్ అయింది. 2017లోనే ఈ చిత్రం 40 కోట్లు షేర్ వసూలు చేసి నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ సినిమా సమయంలో నాని, సాయి పల్లవి మధ్య ఏదో గొడవ జరిగిందనే వార్తలు ఇండస్ట్రీ అంతా వినిపించాయి. పైగా అప్పుడు కనీసం ఒక్కసారి కూడా సినిమా ప్రమోషన్స్‌కు రాలేదు సాయి పల్లవి. నాని వచ్చాడు కానీ పల్లవి కనిపించలేదు. టీం అంతా కలిసి చేసిన ఇంటర్వ్యూలలో కూడా సాయి పల్లవి కనిపించలేదు. సూపర్ హిట్ సినిమాకు హీరోయిన్ రాకపోవడం ఏంటి అనే ప్రశ్నలు కూడా మీడియాలో వచ్చాయి. దీనిపై అటు నాని కానీ.. ఇటు సాయి పల్లవి కానీ క్లారిటీ ఇవ్వలేదు. కానీ కచ్చితంగా షూటింగ్ సమయంలో మాత్రం ఈ ఇద్దరి మధ్య ఏదో మనస్పర్థలు వచ్చాయనే వార్తలు అయితే వచ్చాయి.
దీనిపై ఆ తర్వాత నిర్మాత దిల్ రాజు మాట్లాడాడు. హీరో హీరోయిన్ల మధ్య అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఏదో చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా అన్నీ అయిపోయాయి అంటూ క్లారిటీ ఇచ్చాడు ఈ నిర్మాత. అయినా ప్రతీ చిన్న విషయాన్ని అలా బూతద్దంలో చూడాల్సిన అవసరం కూడా లేదంటూ క్లాస్ తీసుకున్నాడు దిల్ రాజు. అప్పట్లో సాయి పల్లవి తండ్రికి ఆరోగ్యం బాగోలేకపోవడంతోనే ఈమె ఎంసిఏ ప్రమోషన్స్‌కు రాలేదని చెప్పాడు దిల్ రాజు. ఇదిలా ఉంటే ఈ మూడేళ్ళ గ్యాప్‌లో ఈ ఇద్దరూ ఎక్కడా కనిపించలేదు నాని, సాయి పల్లవి. ఈ సినిమాలో కలిసి నటించబోతున్నారనే వార్తలు కూడా ఏం రాలేదు.
కానీ ఇప్పుడు ఉన్నట్లుండి శ్యామ్ సింగ రాయ్ సినిమాలో కలిసి నటించబోతున్నారు ఈ జోడీ. కొన్ని రోజుల నుంచి వార్తలు అయితే వస్తున్నాయి కానీ ఇప్పటి వరకు కన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఇప్పుడు సినిమా ఓపెనింగ్‌లోనే కావాల్సినంత క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రంలో సాయి పల్లవి, మాళవిక నయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ట్యాక్సీ వాలా ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ దర్శకుడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఏదేమైనా కూడా నాని, సాయి పల్లవి కలిసి నటించబోతుండటం మాత్రం అభిమానులకు పండగే పండగ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hero nani, Sai Pallavi, Telugu Cinema, Tollywood