• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • SAI PALLAVI LOVE STORY MOVIE SARANGADARIYA SONG HITS 200 MILLION VIEWS IN YOUTUBE TA

Sai Pallavi: సాయి పల్లవి ఖాతాలో మరో రికార్డు.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..

సాయి పల్లవి ‘సారంగదరియా’ 200 మలియన్ వ్యూస్ (Sai Pallavi)

Sai Pallavi: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ లేకపోయి ఉంటే.. ఆ పాటికి విడుదలై ఉండేది. తాజాగా ఈ సినిమాలోని సారంగదిరియా పాట పూటకో రికార్డులను బ్రేక్ చేస్తోంది.

  • Share this:
    Sai Pallavi: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ లేకపోయి ఉంటే.. ఆ పాటికి విడుదలై ఉండేది. ఇక  ఈ సినిమాలోని ‘సారంగదరియా’ పాట పూటకో రికార్డు బ్రేక్ చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాట అప్పట్లో వివాదం కూడా చెలరేగింది. మంగ్లీ పాడిన ఈ పాట ఫిబ్రవరి 28న యూట్యూబ్‌లో విడుదలై 14 రోజుల్లో 50 మిలియన్ వ్యూస్ రాబట్టింది. అంతేకాదు త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని బుట్టబొమ్మ, రాములో పాటల రికార్డులను తిరగరాసింది.

    ఈ సినిమాకు ఏ.ఆర్.రహమాన్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన పవన్ సిహెచ్ సంగీతం అందించారు. తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో 200 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది.సాయి పల్లవి కెరీర్‌లో మూడో 200 మిలియన్ వ్యూస్ రాబట్టిన మూడో పాట.

    గతంలో సాయి పల్లవి నటించిన ‘మారి 2’లో రౌడీ బేబి సాంగ్.. ‘1.1 బిలియన్ వ్యూస్‌ రాబట్టింది. మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ సినిమాలో వచ్చిండే పాట 300 మిలియన్ వ్యూస్ పైగా రాబట్టింది. తాజాగా సారంగదరియా.. 200 మిలియన్ వ్యూస్ రాబట్టింది. తెలుగులో సాయి పల్లవికి రెండో 200 మిలియన్ వ్యూస్. ఈ పాట ఫాస్టెస్ట్ 100 మిలియన్‌ వ్యూస్‌తో పాటు ఫాస్టెస్ట్ 200 మిలియన్ వ్యూస్ రాబట్టిన తొలి తెలుగు చిత్రంగా రికార్డులకు ఎక్కింది. సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో రానా హీరోగా ‘విరాట పర్వం’ సినిమాలో నటిస్తోంది. ఇందులో ఈమె కామ్రేడ్ పాత్రలో నటిస్తోంది. మరోవైపు నాని హీరోగా ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో నటిస్తోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: