ఈ వయస్సులో కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం.. : సాయి పల్లవి

Sai Pallavi : సాయి పల్లవి.. 'ఫిదా' సినిమాతో తెలుగువారి గుండెల్లో ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న తమిళ భామ.

news18-telugu
Updated: September 14, 2019, 5:35 PM IST
ఈ వయస్సులో కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం..  : సాయి పల్లవి
Instagram/saipallavi.senthamarai
news18-telugu
Updated: September 14, 2019, 5:35 PM IST
Sai Pallavi :  సాయి పల్లవి.. 'ఫిదా' సినిమాతో తెలుగువారి గుండెల్లో ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న తమిళ పొన్ను. ఆ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఆకట్టుకుంది. సాయి పల్లవి.. తాను ఎంచుకున్న సినిమాల ద్వారా.. మంచి నటిగా.. హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో 'విరాట పర్వం' అనే సినిమాను చేస్తోంది. దీనికి వేణు ఊడుగుల (నీది నాది ఒకే కథ ఫేమ్‌) దర్శకత్వం వహిస్తున్నారు. రానా హీరోగా చేస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్‌ ప్రేమకథగా, రాజకీయ థ్రిల్లర్‌గా సాగనున్న ఈ చిత్రంలో రానా రాజకీయ నాయకుడిగాను, సాయిపల్లవి పేదింటి యువతిగా కనిపించనున్నది అనేది టాక్. కాగా ఈ మూవీలో సాయి పల్లవి మేకప్ లేకుండా నక్స లైట్ పాత్రలో నటించనున్నట్లు సమచారం. గుండెల్నీ పిండిసే సన్నివేశాలతో అల్లుకున్న ఈ కథలో..సాయి పల్లవి,రానా క్యారెక్టర్స్‌ను మనసుకు హత్తుకునే విధంగా చిత్రీకరించనున్నారు. 
Loading...

View this post on Instagram
 

❤️


A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) on

అది అలా ఉంటే.. ఈ మధ్య ఓ ఇంటర్య్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. మనకు నచ్చిన పని చేయడంలో ఉన్న ఆనందమే వేరని.. ఒకవేళ అందులో కష్టాలు ఉన్నా.. ఓ సమయం తర్వాత అవి మంచి అనుభూతులుగా మిగిలిపోతాయంటోంది. అది అలా ఉంటే సాయి పల్లవి ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఫిదా తర్వాత మరో సినిమా చేస్తోంది. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా నటిస్తోంది. ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే అటు తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.మీకు ఫ్రీ టైమ్ దొరుకుతుందా అన్న ప్రశ్నకు సమాధానంగా.. ఆమె మాట్లాడుతూ.. నా దగ్గరకు వచ్చే  ప్రతి కథకూ నేను సరిపోనని.. నాకు నప్పే, సూట్ అయ్యే కథలనే ఎంచుకుంటానంటోంది. అందుకే అప్పుడప్పుడూ నాకూ కొంత ఫ్రీ టైమ్ దొరుకుతుందని చెబుతోంది. అయితే ఈ వయసులో పని చేయకపోతే మరే వయస్సులో చేస్తాం.. తరవాత పని కావాలన్నా దొరకని పరిస్థితి రావోచ్చేమో అని తెలిపింది ఫిదా బ్యూటీ.
First published: September 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...