• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SAI PALLAVI INTERESTING COMMENTS ON RANA DAGGUBATI HERE ARE DETAILS SR

Sai Pallavi : ఆ హీరో సరసన నటించడం నా అదృష్టం : తోటి నటున్ని తెగపొగుడుతున్న సాయి పల్లవి..

Sai Pallavi : ఆ హీరో సరసన నటించడం నా అదృష్టం : తోటి నటున్ని తెగపొగుడుతున్న సాయి పల్లవి..

సాయి పల్లవి Photo : Twitter

Sai Pallavi : తమిళ పొన్ను సాయి పల్లవి విభిన్నమైన పాత్రలను పోషిస్తూ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి.

  • Share this:
    Sai Pallavi : తమిళ పొన్ను సాయి పల్లవి విభిన్నమైన పాత్రలను పోషిస్తూ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా విరాటపర్వంలో సాయిపల్లవి హీరో రానా దగ్గుబాటికి జోడీగా నటిస్తోంది. ఈ క్రమంలో సాయిపల్లవి రానాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ సాయి పల్లవి.. మహిళలను సమదృష్టితో చూసే రానాతో నటించడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. సినిమాలో హీరోయిన్ ముఖ్యపాత్ర పోషించినప్పటికీ, పోస్టర్లలో హీరో కంటే హీరోయిన్ పేరు ముందు వేసేందుకు హీరోలు మాములుగా అంగీకరించరు.. కానీ విరాటపర్వం టైటిల్ కార్డ్స్ లో తన పేరు కంటే ముందు సాయిపల్లవి పేరు ముందుండాలని రానా చెప్పారని, దీంతోనే ఆయన గొప్పతనమేమిటో అర్ధమయిందని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సమాన దృష్టితో ఉండే రానా పక్కన నటించడం అదృష్టంగా భావిస్తున్నట్టు ఆమె తెలిపారు. ఇక ఈరోజు రానా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇక సాయి పల్లవి ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే ఆమె ప్రస్తుతం రానాతో కలిసి విరాట పర్వంలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు నాగచైతన్య హీరోగా వస్తోన్న లవ్ స్టోరీలో హీరోయిన్‌గా చేస్తోంది.

    ఈ రెండు సినిమాలతోపాటు సాయి పల్లవి మరో రెండు సినిమాలకు ఓకే చెప్పింది. ఒకటి నాని హీరోగా వస్తోన్న శ్యామ్ సింగరాయ్ కాగా.. మరోకటి మహా సముద్రం. ఈ సినిమాలో హీరోగా శర్వానంద్ చేస్తున్నాడు. ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. సాయి పల్లవి మరో అదిరిపోయే అవకాశాన్ని అందిపుచ్చుకుందని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ ఇటీవల మరో రీమేక్‌కు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. ఈ సినిమాను 'సితార ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 'అప్పట్లో ఒకడుండేవాడు ఫేమ్' సాగర్ చంద్ర ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో సాయి పల్లవి ఓ హీరోయిన్ గా ఎంపికైనట్టు టాక్ బలంగా వినిపిస్తోంది. ఒకవేళ అది నిజమే అయితే ఈమె గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్టే అని చెప్పాలి.

    ఇటు సినిమాలతో పాటు సాయి పల్లవి ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. పరువు హత్యల బ్యాక్‌డ్రాప్‌లో ఓ తమిళ వెబ్‌ సిరీస్‌ రాబోతోంది. నాలుగు కథల సమాహారంగా రూపొందనున్న ఈ వెబ్‌సిరీస్‌కి గౌతమ్‌ మీనన్‌, వెట్రిమారన్‌, సుధా కొంగర, విఘ్నేష్‌ శివన్‌ వంటి ప్రముఖ తమిళ దర్శకులు డైరెక్ట్‌ చేయబోతున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో నాలుగు భిన్న కథలు, భిన్న నేపథ్యాలు ఉన్నప్పటికీ ప్రతి కథలోని చర్చించే అంశం మాత్రం పరువు హత్యల గురించే ఉండనుంది. ఇక దేశ వ్యాప్తంగా జరిగిన పరువు హత్యల్లో ముఖ్య మైన ఘటనల్నీ ఈ వెబ్ సిరీస్‌లో చర్చిస్తారట. అందులో భాగంగా ఇటీవల సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్యను కూడా చర్చించనున్నారట. ఈ కథను ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్‌ తెరకెక్కిస్తున్నాడు. తమిళంలో రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌ అంథాలజీ 'పావకథైగల్‌' డిసెంబర్ 18న నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు