హోమ్ /వార్తలు /సినిమా /

Sai Pallavi: పండగ పూట కూలి పనులకు వెళ్లిన ప్రముఖ హీరోయిన్

Sai Pallavi: పండగ పూట కూలి పనులకు వెళ్లిన ప్రముఖ హీరోయిన్

సాయి పల్లవి

సాయి పల్లవి

పొలంలో వెళ్లి అల్లం పంట పనుల్లో పాల్గొంది సాయిపల్లవి. అయితే ఇదేదో సినిమా షూటింగ్ కోసం చేసినవి మాత్రం కాదు. తన ఇంటికి దగ్గర్లో ఉన్న పొలంలో వెళ్లి ఇలా సరదాగా పొలం పనులు చేసింది.

  శ్యాం సింగ్ రాయ్ సినిమాలో రోజి పాత్రతో మరోసారి ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్ సాయి పల్లవి. నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి మలయాళ చిత్రం 'ప్రేమమ్'తో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా 'ఫిదా' సినిమాలో నటించింది. ఇందులో భానుమతి పాత్రలో తెలుగు ప్రేక్షకులను తన నటనతో కట్టి పడేసింది. ఆ తర్వాత సాయి పల్లవికి వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలో కూడా సినిమాలు చేస్తూ బిజీగా మారింది.

  తెలుగు, తమిళం, మలయాళంలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ స్టార్‌ హీరోయిన్‌ అయిన సాయి పల్లవి ఉగాది పండగ రోజు వ్యవసాయ కూలీగా మారింది. పొలం పనులు చేసేందుకు హీరోయిన్ రావడంతో.. అక్కడున్న కూలీలంతా ఆశ్చర్యపోయారు. ఇటీవల ‘శ్యామ్‌ సింగరాయ్‌’తో అలరించిన సాయి ప్రస్తుతం షూట్‌ నుంచి కాస్త బ్రేక్ తీసుకుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆమె రైతుగా మారింది. తన ఇంటి వద్ద ఉన్న పొలాల్లోకి వెళ్లి వ్యవసాయ పనులు చేసింది. మిగతా కూలీలతో కలిసి పంట కోత పనుల్లో పాల్గొంది. ఈ ఫొటోలను సాయిపల్లవి ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేయడంతో వైరల్‌గా మారాయి.

  పొలంలో వ్యవసాయ కూలీలు అల్లం పంటని బయటకి తీస్తుండగా సాయి పల్లవి కూడా వారితో చేరి అల్లం పంటని బయటకి తీసింది. రోజంతా వారితో కలిసి పని చేసింది. ఉగాది సందర్భంగా సాయి పల్లవి ఇలా పొలం పనులు చేసింది. పొలంలో ఉన్న కూలీలతో కలిసి ఫోటోలు తీసుకొని, అల్లం పంటతో ఫోటోలు తీసుకొని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది సాయి పల్లవి. ఈ ఫోటోలని షేర్ చేస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలిపింది. ఇక నెటిజన్లు, అభిమానులు, సెలబ్రిటీలు సాయి పల్లవిని పొంగుతూ కామెంట్స్ పెడుతున్నారు.వాటిని చూసిన పలువురు సినీ నటులు ఆమెను మెచ్చుకుంటున్నారు.

  మరోవైపు సాయి పల్లవి .. హీరో రానాతో కలిసి విరాట పర్వం సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నక్సల్స్ బ్యాగ్రౌండ్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Rana daggubati, Sai Pallavi, Tollywood

  ఉత్తమ కథలు