Sai Pallavi : సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య సరసన లవ్ స్టోరి చేస్తోంది. దీనికి తోడు శర్వానంద్ హీరోగా ఆర్ ఎక్స్ 100 ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. సాయి పల్లవి ఓ పాత్ర ఒప్పుకున్నదంటే.. ఆ పాత్ర కోసం ఏమైనా చేస్తుంటుంది. ఉదాహారణకు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. ఒరిజినల్‌గా సాయి పల్లవి తమిళ అమ్మాయి అయినా.. ఆ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ పల్లెటూరు అమ్మాయిగా అదరగొట్టింది. తాను ఎంచుకున్న సినిమాల ద్వారా మంచి నటిగా పాత్రకు తగ్గట్లు హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు తెచ్చుకుంది. తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి నటనను ఎవరూ మరచిపోలేరు.
ఇక మరోసారి అలాంటీ పాత్రలో కనిపించనుంది సాయి పల్లవి. నాని హీరోగా యువ దర్శకుడు విజయ్ దేవరకొండ టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్‌తో ఓ మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్యామ్ సింగరాయ్ పేరుతో తెరకెక్కనున్న ఆ చిత్రంలో నానికి జోడిగా సాయిపల్లవి నటిస్తోంది. అయితే ఈ సినిమాలో సాయి పల్లవి కథ ప్రకారం పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. ఆమె నటిస్తోన్న మరో సినిమా విరాట పర్వంలో కూడా పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. రానా హీరోగా చేస్తున్నాడు. తెలంగాణ నేపథ్యంలో రాజకీయ థ్రిల్లర్‌గా వస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hero nani, Naga Chaitanya Akkineni, Sai Pallavi, Sharwanand, Tollywood news