Rowdy Baby Song: ‘రౌడీ బేబీ’ సాంగ్ అరుదైన రికార్డ్.. 100 కోట్ల మంది వీక్షించిన ఫస్ట్ ఇండియన్ సాంగ్‌గా సరికొత్త రికార్డ్..

Rowdy Baby Song Dhanush Sai Pallavi 1 Billion Views in Youtube | సాయి పల్లవి, ధనుశ్ హీరోగా నటించిన ‘మారి 2’ లోని రౌడీ బేబి క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ పాట ఇపుడు మరో అరుదైన రికార్డు నెలకొల్పింది. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: November 17, 2020, 6:35 AM IST
Rowdy Baby Song: ‘రౌడీ బేబీ’ సాంగ్ అరుదైన రికార్డ్.. 100 కోట్ల మంది వీక్షించిన ఫస్ట్ ఇండియన్ సాంగ్‌గా సరికొత్త రికార్డ్..
యూబ్యూట్‌లో రౌడీ బేబి మరో అరుదైన రికార్డు (Youtubu/Photo)
  • Share this:
Rowdy Baby Song Dhanush Sai Pallavi 1 Billion Views in Youtube | సాయి పల్లవి, ధనుశ్ హీరోగా నటించిన ‘మారి 2’ లోని రౌడీ బేబి క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ పాట ఇపుడు మరో అరుదైన రికార్డు నెలకొల్పింది. వివరాల్లోకి వెళితే.. వ‌చ్చిండే.. మెల్ల‌మెల్ల‌గా వ‌చ్చిండే.. ఈ పాట తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కుడు ఉండ‌డేమో..? ఫిదా సినిమాలోని ఈ పాట‌కు అంతా ఫిదా అయిపోయారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీకి తోడు సాయిప‌ల్ల‌వి డాన్సుల‌కు నిజంగానే అంతా ఫిదా అయిపోయారు. ఈ పాట యూ ట్యూబ్‌లో ఎన్నో సంచలనాలు సృష్టించింది. సౌత్ ఇండియన్ సినిమా ఇండ‌స్ట్రీలో ఏ సినిమాకు సాధ్యం కాని రికార్డుల మోత మోగించింది వచ్చిండే సాంగ్‌. ఈ రికార్డ్ అందుకోవాలంటే మ‌ళ్లీ ఎన్నాళ్లు ప‌డుతుందో అనుకున్నారు కానీ సాయిప‌ల్ల‌వే వ‌చ్చి ఓన్ రికార్డ్ బ‌ద్ద‌లు కొట్టేసింది. రౌడీ బేబీతో యూ ట్యూబ్ రికార్డులతో పాటు ఇండియన్ పాటల రికార్డులను కూడా తిరగరాస్తుంది.

ఫిదా వచ్చిండే సాంగ్
ఫిదా వచ్చిండే సాంగ్


2017 మొత్తం ఫిదా పాట‌తోనే మార్మోగిపోయింది. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 278 మిలియ‌న్ వ్యూస్ అందుకుని యూ ట్యూబ్‌లో స‌రికొత్త సంచ‌ల‌నాల‌కు తెర‌తీసింది ఫిదా వ‌చ్చిండే పాట‌. ఇప్పుడు ధ‌నుష్ హీరోగా మారి 2లో ఉన్న రౌడీ బేబీ పాట దుమ్ము దులిపేస్తుంది. ఈ పాట కేవ‌లం 2 ఏళ్లలో 1 బిలియ‌న్ వ్యూస్ అందుకుని.. ప్రస్తుతం ఇండియన్ సినిమా రికార్డులన్నీ తన పేర రాసుకుంది. అంటే ఈ  పాటను యూట్యూబ్‌లో 100 కోట్ల మంది చూసారన్న మాట.  ఇండియాలో సల్మాన్ ఖాన్ టైగర్ జిందా హై స్వాగ్ సే స్వాగత్ పాట 866 మిలియన్స్‌తో రెండో స్థానంలో ఉంది.

ఆ పాట తర్వాత ఇంత వేగంగా హైయ్యస్ట్ వ్యూస్ అందుకున్న పాట రౌడీ బేబీనే. సౌత్ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ పాట‌కు కూడా ఈ స్థాయి వ్యూస్ రాలేదు. ఇప్ప‌టికీ రౌడీ బేబీ పాట‌కు వ్యూస్ వ‌చ్చాయి.. ఇంకా వ‌స్తూనే ఉన్నాయి. ఈ రెండు పాట‌ల్లోనూ సాయిప‌ల్ల‌వి ఉండ‌టం విశేషం. ఈమె డాన్సుల‌కు తోడు ఆ బీట్ కూడా అలాగే ఉండ‌టంతో ఆరు నుంచి అర‌వై వ‌ర‌కు అంతా ఆ పాట‌కు నిజంగానే ఫిదా అయిపోయారు. తాజాగా యూట్యూబ్‌లో 1 బిలియన్ (100 కోట్ల) వ్యూస్ సాధించి యూ ట్యూబ్ రికార్డుల్లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది రౌడీ బేబీ సాంగ్.

రౌడీ బేబీ సాంగ్ ఫైల్ ఫోటోస్ (Rowdy Baby video song 800 M)
రౌడీ బేబీ సాంగ్ ఫైల్ ఫోటోస్ (Rowdy Baby video song 800 M)


ధనుష్ స్వయంగా రాసి.. ఈ పాట పాడాడు. ఈ పాటను యువన్ శంకర్ రాజా స్వరపరిచాడు. ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులను కంపోజ్ చేసాడు ప్రముఖ కొరియోగ్రఫర్ ప్రభుదేవా. జానీ మాస్టర్ కూడా ఈ పాటకు స్టెప్పులు కంపోజ్ చేసాడు. 'రౌడీ బేబీ' వీడియో సాంగ్ రికార్డులను యూ ట్యూబ్ స్వయంగా ప్రకటించడం విశేషం. ఈ సినిమాకు వచ్చిన డబ్బుల కంటే కూడా యూ ట్యూబ్‌లో ఈ పాట చేసిన అరాచకానికి అక్కడ్నుంచి వచ్చిన డబ్బులే అధికంగా ఉంటాయేమో..? 1 బిలియన్ అంటే 100 కోట్ల మంది ఈ పాటను చూసారు. ముందు ముందు ఈ రౌడీ బేబి భారతీయ చిత్ర పరిశ్రమలో ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 17, 2020, 6:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading