• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SAI PALLAVI DHANUSH MAARI 2 ROWDY BABY SONG CREATING SENSATIONAL RECORDS IN YOU TUBE PK

సాయి పల్లవి ‘రౌడీ బేబీ’ దెబ్బకు సౌత్ ఇండియన్ రికార్డ్స్ ఫసక్..

సాయి పల్లవి ‘రౌడీ బేబీ’ దెబ్బకు సౌత్ ఇండియన్ రికార్డ్స్ ఫసక్..

రౌడీ బేబీ సాంగ్ ఫైల్ ఫోటోస్

వ‌చ్చిండే.. మెల్ల‌మెల్ల‌గా వ‌చ్చిండే.. ఈ పాట తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కుడు ఉండ‌డేమో..? ‘ఫిదా’ సినిమాలోని ఈ పాట‌కు అంతా ఫిదా అయిపోయారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీకి తోడు సాయిప‌ల్ల‌వి డాన్సుల‌కు..

  • Share this:
వ‌చ్చిండే.. మెల్ల‌మెల్ల‌గా వ‌చ్చిండే.. ఈ పాట తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కుడు ఉండ‌డేమో..? ‘ఫిదా’ సినిమాలోని ఈ పాట‌కు అంతా ఫిదా అయిపోయారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీకి తోడు సాయిప‌ల్ల‌వి డాన్సుల‌కు నిజంగానే అంతా ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు ఈ పాట మ‌రో సంచ‌ల‌నం సృష్టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు సౌత్ ఇండియన్ సినిమా ఇండ‌స్ట్రీలో ఏ సినిమాకు సాధ్యం కాని రికార్డుల మోత మోగించింది ఈ పాట‌. ఈ రికార్డ్ అందుకోవాలంటే మ‌ళ్లీ ఎన్నాళ్లు ప‌డుతుందో అనుకున్నారు కానీ సాయిప‌ల్ల‌వే వ‌చ్చి ఓన్ రికార్డ్ బ‌ద్ద‌లు కొట్టేసింది.
Sai Pallavi Dhanush Maari 2 Rowdy Baby song creating sensational records in You Tube pk వ‌చ్చిండే.. మెల్ల‌మెల్ల‌గా వ‌చ్చిండే.. ఈ పాట తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కుడు ఉండ‌డేమో..? ‘ఫిదా’ సినిమాలోని ఈ పాట‌కు అంతా ఫిదా అయిపోయారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీకి తోడు సాయిప‌ల్ల‌వి డాన్సుల‌కు.. maari 2 rowdy baby Song,rowdy baby Song 725M Views,725M Views For rowdy baby Song maari 2,maari 2 rowdy baby sai pallavi,sai pallavi Dhanush rowdy baby song,fidaa movie Vachinde Song 182M Views,fidaa movie sai pallavi song,fidaa sai pallavi varun tej,fidaa vachinde Video Song,మారి 2 రౌడీ బేబీ సాంగ్,సాయిపల్లవి రౌడీ బేబీ సాంగ్,రౌడీ బేబీ సాంగ్ 725 మిలియన్ వ్యూస్,ఫిదా వచ్చిండే పాటను దాటేసిన రౌడీ బేబీ సాంగ్,సాయిపల్లవి ఫిదా,ఫిదా వచ్చిండే,తెలుగు సినిమా
రౌడీ బేబీ సాంగ్ ఫైల్ ఫోటోస్

ఫిదాకు రెండేళ్లు ప‌ట్టిన రికార్డ్ ఇప్పుడు రౌడీ బేబీ పాట‌కు మాత్రం కేవ‌లం నెల రోజులు ప‌ట్టేసింది. 2017 మొత్తం ఫిదా పాట‌తోనే మార్మోగిపోయింది. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 183 మిలియ‌న్ వ్యూస్ అందుకుని యూ ట్యూబ్‌లో స‌రికొత్త సంచ‌ల‌నాల‌కు తెర‌తీసింది ‘ఫిదా’ వ‌చ్చిండే పాట‌. ఇక ఇప్పుడు ధ‌నుష్ హీరోగా మారి 2లో ఉన్న రౌడీ బేబీ పాట దుమ్ము దులిపేస్తుంది. ఈ పాట కేవ‌లం 11 నెలల్లోనే ఏకంగా 725 మిలియ‌న్ వ్యూస్ అందుకుని.. ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా రికార్డులన్నీ తన పేర రాసుకుంది.
Sai Pallavi Dhanush Maari 2 Rowdy Baby song creating sensational records in You Tube pk వ‌చ్చిండే.. మెల్ల‌మెల్ల‌గా వ‌చ్చిండే.. ఈ పాట తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కుడు ఉండ‌డేమో..? ‘ఫిదా’ సినిమాలోని ఈ పాట‌కు అంతా ఫిదా అయిపోయారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీకి తోడు సాయిప‌ల్ల‌వి డాన్సుల‌కు.. maari 2 rowdy baby Song,rowdy baby Song 725M Views,725M Views For rowdy baby Song maari 2,maari 2 rowdy baby sai pallavi,sai pallavi Dhanush rowdy baby song,fidaa movie Vachinde Song 182M Views,fidaa movie sai pallavi song,fidaa sai pallavi varun tej,fidaa vachinde Video Song,మారి 2 రౌడీ బేబీ సాంగ్,సాయిపల్లవి రౌడీ బేబీ సాంగ్,రౌడీ బేబీ సాంగ్ 725 మిలియన్ వ్యూస్,ఫిదా వచ్చిండే పాటను దాటేసిన రౌడీ బేబీ సాంగ్,సాయిపల్లవి ఫిదా,ఫిదా వచ్చిండే,తెలుగు సినిమా
రౌడీ బేబీ సాంగ్ ఫైల్ ఫోటోస్

ఇంత వేగంగా హైయ్యస్ట్ వ్యూస్ అందుకున్న పాట ఇదే. సౌత్ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ పాట‌కు కూడా ఈ స్థాయి వ్యూస్ రాలేదు. ఇప్ప‌టికీ రౌడీ బేబీ పాట‌కు వ్యూస్ వ‌చ్చాయి.. ఇంకా వ‌స్తూనే ఉన్నాయి. ఈ రెండు పాట‌ల్లోనూ సాయిప‌ల్ల‌వి ఉండ‌టం విశేషం. ఈమె డాన్సుల‌కు తోడు ఆ బీట్ కూడా అలాగే ఉండ‌టంతో ఆరు నుంచి అర‌వై వ‌ర‌కు అంతా ఆ పాట‌కు నిజంగానే ఫిదా అయిపోయారు. మొత్తానికి సాయిప‌ల్ల‌వి రౌడీబేబీ దెబ్బ‌కు ఇప్పుడు ఫిదా ఫ‌స‌క్ అయిపోయింద‌న్న‌మాట‌.

ఇప్పటి వరకూ 725 మిలియన్ వ్యూస్ సాధించి యూ ట్యూబ్ రికార్డుల్లో 7వ స్థానాన్ని సొంతం చేసుకుంది రౌడీ బేబీ సాంగ్. ధనుష్ స్వయంగా రాసి.. ఈ పాట పాడాడు. ఈ పాటను యువన్ శంకర్ రాజా స్వరపరిచాడు. ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులను కంపోజ్ చేసాడు ప్రముఖ కొరియోగ్రఫర్ ప్రభుదేవా. జానీ మాస్టర్ కూడా ఈ పాటకు స్టెప్పులు కంపోజ్ చేసాడు. 'రౌడీ బేబీ' వీడియో సాంగ్ టాప్ 7లో నిలిచి రికార్డులను సృష్టించిన విషయాన్ని యూట్యూబ్ స్వయంగా ప్రకటించడం విశేషం.
Published by:Praveen Kumar Vadla
First published: