Rowdy Baby Song Dhanush Sai Pallavi 1 Billion Views Controversy | సాయి పల్లవి, ధనుశ్ హీరోగా నటించిన ‘మారి 2’ లోని రౌడీ బేబి క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. తాజాగా ఈ పాట 1 బిలియన్ వ్యూస్ సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన కామన్ డీపి ఇపుడు వివాదాలకు కేంద్ర బిందువు అయింది.
Rowdy Baby Song Dhanush Sai Pallavi 1 Billion Views Controversy | సాయి పల్లవి, ధనుశ్ హీరోగా నటించిన ‘మారి 2’ లోని రౌడీ బేబి క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ పాట వన్ బిలియన్ వ్యూస్ (100 కోట్లు) వ్యూస్‌తో మరో అరుదైన రికార్డు నెలకొల్పింది. దక్షిణాదిలోనే కాదు.. హోల్ ఇండియాలోనే యూట్యూబ్‌లో ఓ పాట సోలోగా వంద కోట్ల (1 బిలియన్) వ్యూస్ రాబట్టిన పాటగా ఈ పాట రికార్డులు క్రియేట్ చేసింది. ఈ ఘనట సాధించిన సౌత్ ఇండియా పాటగా రౌడీ బేబి సాంగ్ ఘనతను చెబుతూ.. చిత్ర యూనిట్ వండర్ బార్ ఓ కామన్ డీపికి విడుదల చేసింది. అందులో కేవలం సాయి పల్లవిని కాకుండా.. ధనుశ్ మాత్రమే ఉన్నాడు ఈ కామన్ డీపీలో. ప్రభుదేవా సమకూర్చిన ఈ పాటకు ధనుశ్, సాయి పల్లవిల డాన్స్ మరో లెవల్‌కి తీసుకెళ్లింది. ముఖ్యంగా ఈ పాటలో సాయి పల్లవి డాన్స్ స్టెప్పులకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ధనుశ్ మైమరించి మరి సాయి పల్లవి హైలెట్‌గా నిలిచింది. ఈ పాట తర్వాత సాయి పల్లవిని అందరు రౌడీ బేబి అని పిలుస్తున్నారు.
ఈ డీపిలో సాయి పల్లవి లేకుండా విడుదల చేయడంపై ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా వండర్ బార్ చిత్ర యూనిట్‌ను ఎండగడుతున్నారు. చిత్ర యూనిట్ సాయి పల్లవికి క్రెడిట్ ఇవ్వకుండా.. కేవలం ధనుశ్కు మాత్రమే ఇవ్వడంపై మండిపడుతున్నారు. అంతేకాదు సాయి పల్లవికి పాట పాడిన ‘థీ’ పేరు మెన్షన్ చేయకపోవడం పై కూడా మండిపడుతున్నారు.
Anganakulla paatula Sai Pallavi ya thooki podradhu, urutti vidradhu, somersault adikka veikkardhu lam pannitu. Dhanush ku mattum CDP. Nice
ఈ పాట సక్సెస్‌లో ఎక్కువగా సాయి పల్లవికే క్రెడిట్ దక్కుతుందని చెబుతున్నారు. మొత్తంగా.. రౌడీ బేబి సాంగ్.. సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ పాటకు రానీ వ్యూస్ ఈ పాటకు వచ్చింది. మొత్తంగా ఈ పాట సాధించిన విజయం కంటే ఇపుడు ఈ వివాదం ఈ సినిమా యూనిట్‌ను ఇబ్బంది పెడుతోంది.
‘మారి 2’లో రౌడీ బేబి పాటను ధనుష్ స్వయంగా రాసి.. ఈ పాట పాడాడు. ఈ సాంగ్ ను యువన్ శంకర్ రాజా స్వరపరిచాడు. ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులను కంపోజ్ చేసాడు ప్రముఖ కొరియోగ్రఫర్ ప్రభుదేవా. జానీ మాస్టర్ కూడా ఈ పాటకు స్టెప్పులు కంపోజ్ చేసాడు. 'రౌడీ బేబీ' వీడియో సాంగ్ రికార్డులను యూ ట్యూబ్ స్వయంగా ప్రకటించడం విశేషం. ఈ సినిమాకు వచ్చిన డబ్బుల కంటే కూడా యూ ట్యూబ్‌లో ఈ పాట చేసిన అరాచకానికి అక్కడ్నుంచి వచ్చిన డబ్బులే అధికంగా ఉంటాయేమో..? 1 బిలియన్ అంటే 100 కోట్ల మంది ఈ పాటను చూసారు. ముందు ముందు ఈ రౌడీ బేబి భారతీయ చిత్ర పరిశ్రమలో ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.