• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • SAI PALLAVI DEMANDS HUGE FOR TO ACT IN PAWAN KALYAN AYYAPPANUM KOSHIYUM TELUGU REMAKE FOR THIS REASON SR

Sai Pallavi : ఆ హీరో సరసన నటించడానికి రెండు కోట్లు డిమాండ్ చేస్తోన్న సాయి పల్లవి.. కారణం ఇదే..

Sai Pallavi : ఆ హీరో సరసన నటించడానికి రెండు కోట్లు డిమాండ్ చేస్తోన్న సాయి పల్లవి.. కారణం ఇదే..

సాయి పల్లవి Photo : Instagram

Sai Pallavi : తమిళ పొన్ను సాయి పల్లవి విభిన్నమైన పాత్రలను పోషిస్తూ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి.

  • Share this:
    Sai Pallavi : తమిళ పొన్ను సాయి పల్లవి విభిన్నమైన పాత్రలను పోషిస్తూ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. మలయాళం 'ప్రేమమ్' సినిమాతో సౌత్‌లో మంచి క్రేజ్ దక్కించుకుంది సాయి పల్లవి. ఈ భామ అందగత్తే కాదు మంచి నటి కూడా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. ఆ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ పల్లెటూరు అమ్మాయిగా అదరగొట్టింది. సాయి పల్లవి తాను ఎంచుకున్న సినిమాల ద్వారా మంచి నటిగా పాత్రకు తగ్గట్లు హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు తెచ్చుకుంది. ఆ సినిమాలో భానుమతి పాత్ర లో సాయి పల్లవి చెప్పిన డైలాగులు సినిమాకే హైలెట్ అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ సినిమా తర్వాత నానితో 'ఎంసీఏ' సినిమాతో కూడా మంచి విజయం సాధించడం జరిగింది. అయితే ఆ తర్వాత వచ్చిన 'ఎన్జీకె', 'పడి పడి లేచె మనసు' సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో కొంత నిరుత్సాహాపడిన మళ్లి పుంజుకుని వరుస సినిమాలతో అదరగొడుతోంది. ఆమెకు తాజాగా మరో సినిమాలో నటించే అవకాశం వచ్చింది. పవన్‌కళ్యాణ్ రానా కాంబినేషన్ లో అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఇటీవలే పూజా కార్యక్రమాలతో షురూ అయింది.

    ఈ చిత్రంలో అయ్యప్పన్ నాయర్‌ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తోండగా.., కొషీ పాత్రను రానా చేస్తున్నాడు. అయితే ఇప్పటికే రానా వైఫ్ పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ ఫిక్స్ అవ్వగా.. సముద్రఖని రానా తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్‌కు జోడిగా టాలెంటెడ్ యాక్టర్ సాయిపల్లవిని పరిశీలిస్తోందట చిత్రబృందం.

    దీనికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో సాయిపల్లవి నటించడానికి ఆమె రూ.2 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. దీనికి ఓ కారణం ఉందట.. కథానుగుణంగా సాయి పల్లవి పాత్ర నిడివి సినిమాలో ఎక్కువగా ఉండడంతో.. భారీ మొత్తంలో డిమాండ్ చేస్తుందట. ఇక ఈ సినిమాను అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు.


    ఇక సాయి పల్లవి ఇతర సినిమాల విషయానికి వస్తే.. వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా విరాటపర్వంలో సాయిపల్లవి హీరో రానా దగ్గుబాటికి జోడీగా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు నాగచైతన్య హీరోగా వస్తోన్న లవ్ స్టోరీలో హీరోయిన్‌గా చేస్తోంది. ఈ రెండు సినిమాలతోపాటు సాయి పల్లవి మరో రెండు సినిమాలకు ఓకే చెప్పింది. ఒకటి నాని హీరోగా వస్తోన్న శ్యామ్ సింగరాయ్ కాగా.. మరోకటి మహా సముద్రం. ఈ సినిమాలో హీరోగా శర్వానంద్ చేస్తున్నాడు. ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. సాయి పల్లవి ఇటు సినిమాలతో పాటు ఓ వెబ్ సిరీస్ కూడా చేసింది. పరువు హత్యల బ్యాక్‌డ్రాప్‌లో ఓ తమిళ వెబ్‌ సిరీస్‌ వచ్చింది. నాలుగు కథల సమాహారంగా రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌కి గౌతమ్‌ మీనన్‌, వెట్రిమారన్‌, సుధా కొంగర, విఘ్నేష్‌ శివన్‌ వంటి ప్రముఖ తమిళ దర్శకులు డైరెక్ట్‌ చేశారు. ఈ వెబ్ సిరీస్‌లో నాలుగు భిన్న కథలు, భిన్న నేపథ్యాలు ఉన్నప్పటికీ ప్రతి కథలోని చర్చించే అంశం మాత్రం పరువు హత్యలే. తమిళంలో రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌ అంథాలజీ 'పావకథైగల్‌' డిసెంబర్ 18నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.
    Published by:Suresh Rachamalla
    First published: