సాయి పల్లవి .. రానా జంటగా నటించిన మూవీ విరాట పర్వం(Virata Parvam). త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా టీం ప్రమోషన్లలో బిజీగా మారింది. అయితే ప్రమోషన్ల కోసం తాజాగా సాయి పల్లవి పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంది. ఈక్రమంలో తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సాయి పల్లవి (Sai Pallavi) చేసిన కామెంట్స్‌తో ఇప్పుడు కొందరు నెటిజన్లు ఆమె సినిమా చూడబోమంటూ షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. విరాట పర్వం నక్సల్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో తెరకెక్కిన సినిమా. ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ.. సాయి పల్లవి ఈ మధ్యనే కశ్మీర్ ఫైల్స్(Kashmir files) సినిమా చూశానని చెప్పుకొచ్చింది.
కశ్మీర్ ఫైల్స్ సినిమాలో కశ్మీరి పండింట్లను ఎలా చంపారో ఆ సినిమాలో చూపించారన్నారు. కానీ ఇప్పుడు కూడా గోవధ చేస్తున్నారంటూ.. ఆవును తీసుకెళ్తున్న ముస్లీం డ్రైవర్‌ను కొట్టి జై శ్రీరామ్ అనాలన్నారు. అప్పుడు జరిగిన దానికి.. ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది అంటూ సాయి పల్లవి ప్రశ్నించింది.దీంతో ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సాయి పల్లవి చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడుతుందని పలువురు నెటిజన్లు ఆమెను విమర్శిస్తున్నారు. అంతే కాదు ఆమె నటించిన విరాట పర్వం సినిమా కూడా చూడమంటూ పోస్టులు పెడుతున్నారు. మరి సాయి పల్లవి దీనిపై ఏమైనా క్లారిటీ ఇస్తాదేమో చూడాలి.
మరోవైపు రానా - సాయిపల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో 'విరాట పర్వం' సినిమా ఈనెల 17న విడుదల కానుంది. సురేశ్ బాబు - సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ .. శిల్పకళావేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. వెంకటేశ్ .. చరణ్ .. సుకుమార్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
Now I understand why ‘beauty with brains’ have such a high repute.
.
Seriously, @Sai_Pallavi92 ?
Genocide = Cow theft with intention to (smuggle for) slaughter ????
.
We hindus, generally, don’t encourage cow slaughter. You might not know,
. https://t.co/2K26gWdDfP
— Adi (@bakvvaas) June 14, 2022
విరాట పర్వం కథ విషయానికి వస్తే.. 1990లలో గ్రామీణ నేపథ్యంలో సాగే నక్సలిజంతో ముడిపడిన కథ ఇది. జరీనా వాహెబ్ .. ఈశ్వరీరావు .. ప్రియమణి .. నివేదా పేతురాజ్ .. నందితా దాస్ . నవీన్ చంద్ర ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సినిమాతో తనకి హ్యాట్రిక్ హిట్ పడుతుందనే నమ్మకంతో సాయిపల్లవి ఉంది. అయితే ఇదే సమయంలో సాయి పల్లవి చేసిన కామెంట్స్ వివాదాస్పదం కావడంతో మరి ఈ సినిమాపై ఎంత వరకు ప్రభావం చూపుతాయో అనేది తెలియాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.