హోమ్ /వార్తలు /సినిమా /

ఈ ఫోటోలో చీర చుట్టుకుని ఉన్న చిన్నారి ఓ స్టార్ హీరోయిన్.. ఎవరో చెప్పుకోండి చూద్దాం.. !

ఈ ఫోటోలో చీర చుట్టుకుని ఉన్న చిన్నారి ఓ స్టార్ హీరోయిన్.. ఎవరో చెప్పుకోండి చూద్దాం.. !

స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో

స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో

ఆ హీరోయిన్ తల్లి ప్రముఖ పుట్టపర్తి సాయి బాబా భక్తురాలు. అంతేకాదు.. ఆ భక్తితో కూతురి పేరులో సాయి కూడా చేర్చింది. ఈమెకు ఓ చెల్లెలు కూడా ఉంది. వీరిద్దరు కవల పిల్లలు.

సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలు అంటే.. మనమంతా చాలా ఇంట్రస్టింగ్‌గా చూస్తాం.. ఫోటోలో ఉన్నది ఎవరు అంటూ గుర్తు పట్టేందుకు.. కళ్లప్పగించి చూస్తుంటాం.. అయితే  తాజాగా మరో సెలబ్రిటీ ఫోటో ఒకటి నెట్టింట సందడి చేస్తుంది. ఈ ఫోటో చీరకట్టులో ఉన్న చిన్నారి ప్రస్తుతం.. తెలుగు తమిళ ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్టార్ హీరోయిన్. నేచురల్ స్టార్ హీరోయిన్. చూడటానికి కూడా మన పక్కింటి అమ్మాయిలా చాలా సింపుల్‌గా ఉంటుంది.  ఈ ఫోటోలో సత్యసాయి ఫోటో కూడా ఉంది. ఆ హీరోయిన్ తల్లి పుట్టపర్తి సాయిబాబ భక్తురాలే.. అందుకే ఆమె పేరులో సాయి కూడా చేర్చింది. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది... ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో..!

ఆమె ఇంకెవరో కాదు. లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి.. టాలీవుడ్‌లో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్లలో ఒకరు. ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్‌లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. సాయిపల్లవి తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కొత్తగిరి అనే చిన్న గ్రామంలొ జన్మించింది. సాయిపల్లవి తల్లిదండ్రులు సెంతామరై కన్నన్, రాధామణి . సాయిపల్లవి తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయి చేర్చింది. ఈమె మంచి నర్తకి కూడా. తండ్రి సెంతామరై కస్టమ్స్ అధికారి. సాయి పల్లవి ఆమె చెల్లెలు పూజ కవల పిల్లలు. సాయిపల్లవి కోయంబత్తూరులో పాఠశాల విద్యనభ్యసించింది. తల్లి ప్రభావంతో ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది.

పాఠశాల స్థాయి నుంచి బెరుకు లేకుండా స్టేజ్‌షోలపై నాట్యం చేసేది. ఈమె ఎనిమిదో తరగతి లో ఉండగా ఆమె నాట్యం చూసిన ఓ దర్శకుడు ధూం ధాం అనే తమిళ సినిమాలో కథానాయిక కంగనా రనౌత్ పక్కన చిన్న పాత్రలో అవకాశమిచ్చాడు. తర్వాత 2005లో మీరా జాస్మిన్ క్లాస్ మేట్ గా కస్తూరి మాన్ అనే మరో సినిమాలో సాయి పల్లవి నటించింది.అయితే సాయిపల్లవికి తెలుగులో గుర్తింపు తెచ్చింది మాత్రం ఈటీవీలో ప్రసారమయ్యే ఢీలాంటి కార్యక్రమాల్లో పాల్గొనింది. తండ్రి ఈమె ముందు బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో జార్జియా లో మెడిసన్ చదవడానికి సాయిపల్లవిని పంపించేశారు.

నాలుగేళ్ల పాటు.. చదువు పూర్తి చేసి.. తమిళ దర్శకుడు అల్ఫోన్సో సాయి పల్లవికి ప్రేమమ్ చిత్రంలో నటించడానికి అవకాశం ఇచ్చాడు. ఇక ఆ సినిమా హిట్ కావడంతో... సాయిపల్లవికి వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో భానుమతి పాత్ర పోషించి తెలుగు వారికి పరిచయమయింది. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని స్వంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. తర్వాత నాని సరసన ఎంసీఏ చిత్రంలో నటించింది. సూర్యా 36, కణం, మారి 2, విరాటపర్వం,గార్గి వంటి చిత్రాలలొ నటించింది సాయి పల్లవి.

First published:

Tags: Sai Pallavi, Virata Paravam

ఉత్తమ కథలు