Home /News /movies /

SAI PALLAVAI NAGA CHAITANYA SEKHAR KAMMULA LOVE STORY MOVIE AY PILLA LYRICAL SONG GO VIRAL ON YOUTUBE TA

యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న నాగ చైతన్య, సాయి పల్లవి ‘ఏయ్ పిల్ల’ సాంగ్..

 లవ్ స్టోరీ సాంగ్ విడుదల (Twitter/Photo)

లవ్ స్టోరీ సాంగ్ విడుదల (Twitter/Photo)

‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత శేఖర్ కమ్ముల నాగచైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా ‘లవ్‌స్టోరీ’ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఏయ్ పిల్ల సాంగ్ విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

    ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత శేఖర్ కమ్ముల నాగచైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా ‘లవ్‌స్టోరీ’ సినిమా చేస్తున్నాడు. మరోవైపు నాగ చైతన్య కూడా మజిలీ, వెంకీ మామ సక్సెస్‌లతో మంచి ఊపు మీదున్నాడు. ఇపుడు తన ఫ్యామిలీ ఇమేజ్‌కు తగ్గట్టు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తున్నాడు.తాజాగా ఈ సినిమా నుంచి ‘ఏయ్ పిల్లా పరుగున పోదామా అనే పాటను రిలీజ్ రిలీజ్  చేసారు. ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ శిష్యుడు పవన్ సంగీతం అందిస్తోన్నాడు. తాజాగా విడులైన ఈ  పాటను  పింగళి చైతన్య మంచి సాహిత్యాన్ని అందించాడు. హరిచరణ్ గాత్రంలో ఈ పాట వినసొంపుగా ఉంది. తాజాగా విడుదలైన ఈ పాట సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ పాట కూడా ఫిదా రేంజ్‌లో హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

    ‘లవ్ స్టోరీ’ సినిమా స్టోరీ విషయానికొస్తే.. ఓ ఊరు నుంచి పట్నానికి వచ్చి జీవితంలో ఏదో సాధించాలి అనుకునే ఇద్దరి మధ్య నడిచే ప్రేమకథ ఇది.. శేఖర్ కమ్ముల  ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో నాగ చైతన్య పూర్తి తెలంగాణ యాసలో మాట్లాడుతాడట. చైతూ తెలంగాణ యాస ఈ సినిమాకు హైలెట్ అని చెబుతున్నారు.  మరోవైపు సాయి పల్లవి కూడా మరోసారి తెలంగాణ అమ్మాయిగా నటించబోతుంది. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Love Story Movie, Naga Chaitanya Akkineni, Sai Pallavi, Sekhar kammula, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు