హోమ్ /వార్తలు /సినిమా /

‘చిత్రలహరి’ ట్రైలర్ టాక్.. ఈ సారైనా సాయి ధరమ్ తేజ్ హిట్ ట్రాక్ ఎక్కుతాడా..

‘చిత్రలహరి’ ట్రైలర్ టాక్.. ఈ సారైనా సాయి ధరమ్ తేజ్ హిట్ ట్రాక్ ఎక్కుతాడా..

తాజాగా సాయి ధరమ్ తేజ్ ..కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ సినిమా చేసాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసారు.

  మెగా ఫ్యామిలీ అండదండలతో టాలీవుడ్‌లో లెగ్ పెట్టిన సాయి ధరమ్ తేజ్.. వచ్చిన కొత్తలో వరుస హిట్లతో ఫుల్  జోష్‌లో ఉండే. ఆ తర్వాత చేసిన సినిమాలు చేసినట్టు వరుసగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచాయి. ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఆరు ఫ్లాపులతో సాయి ధరమ్ తేజ్ డౌన్ ఫాల్లో ఉంది. తాజాగా సాయి ధరమ్ తేజ్ ..కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ సినిమా చేసాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసారు. ఈ  సినిమా సక్సెస్ కోసం సాయి ధరమ్ తేజ్..తన పేరును సాయి తేజ్‌గా పేరు మార్చుకున్నాడు. సక్సెస్ కోసం పాకులాడే యువకుడిగా సాయి ధరమ్ తేజ్ ఎదురైన సవాళ్లు పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. మధ్యలో హీరోయిన్స్‌తో రొమాన్స్ వంటివి చూపించారు. చీకటికి చిరునామా నేను’ అని చెప్పే డైలాగ్ బాగుంది. మొత్తంగా సక్సెస్ కోసం పాకులాడే యువకుడి పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటన బాగుంది.

  ‘నేను శైలజా’,‘ఉన్నది ఒకటే జిందగీ’ వంటి సినిమాలతో తనేంటో ప్రూవ్ చేసుకున్న కిషోర్ తిరుమల ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా చేస్తున్న ఈ మూవీ టీజర్‌లో ఒక్కో షాట్‌‌లో ఒక్కొక్కరినీ పరిచయం చేస్తూ వారి క్యారెక్టరైజేషన్‌‌ని తెలిపే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. శ్రీమంతుడు, జనతాగ్యారెజ్, రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి దేవిశ్రీ మ్యూజిక్ అందించాడు.

  <iframe width="1244" height="700" src="https://www.youtube.com/embed/tBax6qOUECU" frameborder="0" allow="accelerometer; autoplay; encrypted-media; gyroscope; picture-in-picture" allowfullscreen></iframe>
  సాయి ధరమ్ తేజ్ ఫైల్ ఫోటో

  సాయి ధరమ్ తేజ్... ఈ సినిమా కోసం గుబురు గడ్డంతో కొత్త లుక్ ‌లో కనిపిస్తున్నాడు. ఇందులో ముఖ్యంగా.. చివరగా విజయం ఎప్పుడొస్తుందనని తన ప్రజెంట్ సీరియస్ సిట్య్చువేషన్‌ని కామెడీగానే జోడించినట్లు తెలుస్తోంది. ఈ నెల 12న విడుదలవుతోన్న ‘చిత్రలహరి’తో సాయి తేజ్‌గా హిట్టు అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

  First published:

  Tags: Kishore Tirumala, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు