ఒకటి రెండు కాదు.. వరసగా ఆరు ఫ్లాపులు.. ఇన్ని ప్లాపులు వస్తే కనీసం ఆ హీరో సినిమా చూడ్డానికి కూడా ఆడియన్స్ థియోటర్స్ వైపు కన్నెత్తి చూడరు. కానీ సాయి ధరమ్ తేజ్..లేటెస్ట్ మూవీ ‘చిత్రలహరి’ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబడుతోంది. సాయి ధరమ్ ..గత సినిమాల ఎఫెక్ట్ పడినట్టు లేదు. మొత్తానికి చాలా రోజుల తర్వాత సాయి ధరమ్ తేజ్‌కు చెప్పుకోదగ్గ హిట్ ‘చిత్రలహరి’ సక్సెస్‌తో లభించినట్టైయింది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల్లో రూ.10 కోట్ల షేర్‌ను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈసినిమా థియేట్రికల్ రైట్స్‌ను హోల్‌సేల్‌గా రూ.13.5 కోట్లకు అమ్ముడు పోయింది. మరో రూ.3 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ సాధించినట్లే. ప్రస్తుతం ‘చిత్రలహరి’ టాక్ చూస్తుంటే రూ.3 కోట్లు వసూలు చేయడం పెద్ద లెక్కేం కాదంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ‘చిత్రలహరి’కి రూ.8.5 కోట్ల షేర్ వచ్చినట్టు సమాచారం. యూస్తోె పాటు ఓవర్సీస్లో రూ.కోటి షేర్ రాబట్టింది. ఇంకో రూ.50 లక్షల వస్తే యూఎస్‌లో సేఫ్ జోన్లో ఉన్నట్టే. సినిమా సక్సెస్‌కు తోడు సమ్మర్ హాలీడేస్..కూడా ఉండడంతో ఈ సినిమా లాంగ్ రన్లో మంచి వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు సినీ పండితులు. సాయి తేజ్, కళ్యాణి ప్రియదర్శిని, నివేథా పెతురాజ్లుక నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో మైత్రి మూవీ మేకర్స్ కూడా రెండు ఫ్లాపుల తర్వాత హిట్ అందుకున్నారు. మొత్తానికి ఈ చిత్రం చాలా మంది కెరీర్స్‌కు ప్రాణం పోస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chitralahari Movie Review, Kishore Tirumala, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood, Tollywood Box Office Report