Sai Dharam Tej : కొంత గ్యాప్ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ విరూపాక్ష. డార్క్ ఫ్యాంటసీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. విజువల్స్, సౌండ్ ఈ టీజర్‌లో అదరగొట్టాయి. సాయి ధరమ్ తేజ్ చెప్పిన సమస్య ఎక్కడ మొదలవుతుందో.. పరిష్కారం అక్కడే వెతకాలి.. అనే డైలాగ్ బాగుంది. మొత్తానికి ఈ సినిమాతో సాయి తేజ్ మరో హిట్ అందుకునేలా ఉన్నాడు. ఈ సినిమాలో సాయితేజ్‌కు జోడిగా మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ (Samyuktha Menon) నటించింది. కొత్త డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక అది అది అలా ఉంటే టీమ్ తాజాగా షూటింగ్‌ను కంప్లీట్ చేసుందట. దీనికి సంబంధించి ఓ ప్రకటన చేసింది. ఒక్క సాంగ్ మినహా, మిగతా షూటింగ్ పూర్తి అయినట్లు తెలిపారు. మంచి అంచనాలతో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 21న చిత్రం వరల్డ్ వైడ్ గా విడుదలకానుంది.
విరూపాక్ష సాయి ధరమ్ తేజ్ మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రంగా వస్తోంది. అందులో భాగంగా ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 21న విడుదల కానుంది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్, BVSN ప్రసాద్‌లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మాణం వహించారు. సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
It's a WRAP for #Virupaksha except for one song ???? Get ready to witness the Spectacular Mystical World from Apr 21st in theatres.#VirupakshaOnApril21@IamSaiDharamTej@iamsamyuktha_ @karthikdandu86 @AJANEESHB @Shamdatdop @NavinNooli @bkrsatish @SVCCofficial @SukumarWritings pic.twitter.com/Z3L9ISdJT8
— SVCC (@SVCCofficial) March 31, 2023
ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అజ్ఞానం భయానికి మూలం. భయం మూఢ నమ్మకానికి కారణం. ఆ నమ్మకమే నిజమైనపుడు .. ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనపుడు.. అసలు నిజం చూపించే జ్ఞాన నేత్రం.. హీరోగా తొలిసారి సాయి ధరమ్ చేస్తోన్న థ్రిల్లర్ చిత్రం.
Feel the Intrigue,Thrill & Mystic ????️#VirupakshaTeaser OUT NOW ????
- https://t.co/3ZB4JGVxx2@IamSaiDharamTej@iamsamyuktha_ @karthikdandu86 @AJANEESHB @Shamdatdop @BvsnP @aryasukku @bkrsatish @SVCCofficial @SukumarWritings#CourageOverFear#Virupaksha #VirupakshaOnApril21st pic.twitter.com/zxBikbcbyD — SVCC (@SVCCofficial) March 2, 2023
సాయి ధరమ్ తేజ్ విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తన పెద మేనమామ చిరు మాదిరి మొదటి సినిమా పూర్తైయిన విడుదల కాకుండానే రెండో సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. మెగా మేనల్లుడుగా పరిచయమైన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో ఓ సినిమాను చేస్తున్నారు. తమిళ సినిమా వినోదయ సీతమ్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. జూలై 28న విడుదలకానుంది.
ఈ సినిమాలో శ్రీలీల ఓ ఐటెమ్ సాంగ్ చేయనుందని లేటెస్ట్ టాక్. శ్రీలీల, త్రివిక్రమ్ మహేష్ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. దీంతో ఆమెను త్రివిక్రమ్ ఈ ఐటెమ్ సాంగ్ చేయడానికి ఒప్పించారట. దీనికి పెద్ద మొత్తంలో ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేతిక శర్మ, ప్రియాంక ప్రకాష్ వారియర్ హీరోయిన్‌లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఈసినిమాలో దేవుడుగా కనిపించనుండడంతో ఈ సినిమాకు దేవుడు అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తోంది. దాదాపుగా ఈ టైటిల్‌నే ఖరారు చేసే ఆలోచనలో ఉందట టీమ్. అతి త్వరలో ఈ విషయంలో ఓ ప్రకటన విడుదలకానుందని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tollywood news, Virupaksha