Sai Dharam Tej : కొంత గ్యాప్ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ విరూపాక్ష. డార్క్ ఫ్యాంటసీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. విజువల్స్, సౌండ్ ఈ టీజర్‌లో అదరగొట్టాయి. సాయి ధరమ్ తేజ్ చెప్పిన సమస్య ఎక్కడ మొదలవుతుందో.. పరిష్కారం అక్కడే వెతకాలి.. అనే డైలాగ్ బాగుంది. మొత్తానికి ఈ సినిమాతో సాయి తేజ్ మరో హిట్ అందుకునేలా ఉన్నాడు. ఈ సినిమాలో సాయితేజ్‌కు జోడిగా మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ (Samyuktha Menon) నటించింది. కొత్త డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ టీజర్ ను చూసి ప్రశంసించారు. విరూపాక్ష సాయి ధరమ్ తేజ్ మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రంగా వస్తోంది. అందులో భాగంగా ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 21న విడుదల కానుంది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్, BVSN ప్రసాద్‌లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మాణం వహించారు. సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అజ్ఞానం భయానికి మూలం. భయం మూఢ నమ్మకానికి కారణం. ఆ నమ్మకమే నిజమైనపుడు .. ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనపుడు.. అసలు నిజం చూపించే జ్ఞాన నేత్రం.. హీరోగా తొలిసారి సాయి ధరమ్ చేస్తోన్న థ్రిల్లర్ చిత్రం. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ నచ్చావులే నచ్చవులే పాటను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. కృష్ణకాంత్ రాసిన పాటకు కార్తీక్ పాట పాడారు.
'Love at First Listen' this will be ❤️????#NachavuleNachavule Full song from #Virupaksha OUT NOW ????
- https://t.co/KxI7f3Ze6a@iamsamyuktha_ @karthikdandu86 @AJANEESH @NavinNooli @singer_karthik @kk_lyricist @ChoreographerVJ @SVCCofficial @SukumarWritings #VirupakshaOnApril21 pic.twitter.com/7Iovz3AtAm — Sai Dharam Tej (@IamSaiDharamTej) March 24, 2023
సాయి ధరమ్ తేజ్ విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తన పెద మేనమామ చిరు మాదిరి మొదటి సినిమా పూర్తైయిన విడుదల కాకుండానే రెండో సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. మెగా మేనల్లుడుగా పరిచయమైన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో ఓ సినిమాను చేస్తున్నారు. తమిళ సినిమా వినోదయ సీతమ్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ఇటీవల లాంఛనంగా ప్రారంభం అయ్యింది. షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది.
ఈ సినిమాలో శ్రీలీల ఓ ఐటెమ్ సాంగ్ చేయనుందని లేటెస్ట్ టాక్. శ్రీలీల, త్రివిక్రమ్ మహేష్ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. దీంతో ఆమెను త్రివిక్రమ్ ఈ ఐటెమ్ సాంగ్ చేయడానికి ఒప్పించారట. దీనికి పెద్ద మొత్తంలో ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఈసినిమాలో దేవుడుగా కనిపించనుండడంతో ఈ సినిమాకు దేవుడు అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తోంది. దాదాపుగా ఈ టైటిల్‌నే ఖరారు చేసే ఆలోచనలో ఉందట టీమ్. ఈ సినిమాను జూలై 28న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sai Dharam Tej, Tollywood, Virupaksha