మెగా హీరోలకు బాగా చేరువైన దర్శకుడు మారుతి. శైలజారెడ్డి అల్లుడు సినిమా తర్వాత ఈయన మరే సినిమా అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు అప్పుడూ అంటున్నాడే కానీ తన నెక్ట్స్ సినిమా ఎవరితో అనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉంచాడు మారుతి. ఇన్నాళ్ళకు ఈయన నెక్ట్స్ సినిమాపై క్లారిటీ వచ్చింది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే కథ కూడా సిద్ధమైపోయింది. మారుతి సినిమా కథలన్నీ చాలా టిపికల్‌గా ఉంటాయి.
మనిషిలో ఉన్న గుణాలనే తీసుకుని తన సినిమాలకు కథలుగా వండేస్తుంటాడు మారుతి. జాలి, స్వార్థం, ఈగో, మతిమరుపు.. ఇలా ఒక్కో సినిమాలో ఒక్కోటి చూపించాడు ఈ దర్శకుడు. ఇప్పుడు సాయి కోసం కూడా ఇలాంటి కథనే సిద్ధం చేస్తున్నాడు ఈయన. ఈ సినిమాలో కామెడీతో పాటు ఎమోషన్ కూడా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు మారుతి.
త్వరలోనే ఈ చిత్రంపై పూర్తి క్లారిటీ రానుంది. ఈ మధ్యే చిత్రలహరి సినిమాతో నాలుగేళ్ల తర్వాత హిట్ కొట్టాడు సాయి. అదే ఊపులో ఇప్పుడు మారుతి సినిమాతో సంచలనం సృష్టించాలని చూస్తున్నాడు మెగా మేనల్లుడు. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ నిర్మిస్తుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు బయటికి రానున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sai Dharam Tej, Telugu Cinema, Tollywood